వాదులాట.. అపై సర్దుబాటు
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:17 AM
కురిచేడు మండలం గంగదొన కొండ గ్రామ సర్వే నంబర్లు 88, 90లలో ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు కేటాయించిన స్థలం విషయమై అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఇరు శాఖల అధికారులు ప్లాంట్‌కు కేటాయించిన స్థలం వద్దకు చేరుకుని పరిశీలించారు.

రెవెన్యూ, అటవీ శాఖాధికారుల చర్చలు
సీబీజీ ప్లాంట్‌కు కేటాయించిన స్థలం పరిశీలన
కురిచేడు, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : కురిచేడు మండలం గంగదొన కొండ గ్రామ సర్వే నంబర్లు 88, 90లలో ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు కేటాయించిన స్థలం విషయమై అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఇరు శాఖల అధికారులు ప్లాంట్‌కు కేటాయించిన స్థలం వద్దకు చేరుకుని పరిశీలించారు. ఎవరి హద్దులు వారు చూసుకున్నారు. ఎవరికి వారు నివేదికలు తయారు చేసుకుని ఉన్నతాధికారులకు పంపారు. తహసీ ల్దార్ రజనీకుమారి, సర్వేయర్లు, ఆర్‌ఐ, వీఆర్వోలతో రాగా.. అటవీ శాఖ జిల్లా అధికారి వినోద్ కుమార్ తమ సిబ్బందితో వచ్చారు. ప్రారం భంలో ఇరు శాఖాధికారులు స్థలం మాదంటే మాది అని వాదులా డుకొని చివరకు సర్దుకుపోయారు. ఉన్నతాధికారులు ఏం చెప్తే అదే చేద్దామన్న నిర్ణయానికి వచ్చారు. మంగళవారం ఉదయం నుంచి ఎక్స్‌కవేటర్లతో చిల్లచెట్లను తొలగించే పనులు చేపట్టారు. పనులు జరుగుతుండగానే అధికారులు చర్చించుకున్నారు. కార్యక్రమంలో అటవీ శాఖకు చెందిన డీఎఫ్‌వో వినోద్‌కుమార్, అసిస్టెంట్ డీఎఫ్‌వో పి.శ్రీనివాసరావు, ఎఫ్‌ఆర్‌వో నరసింహారావు, డిప్యూటీ ఆర్‌వో బి.నాయక్, ఎఫ్‌బీవో ధనలక్ష్మి, తహసీల్దార్ రజనీకుమారి, ఆర్‌ఐ నాగరాజు, వీఆర్వో హనుమంతరావు, సర్వేయర్లు పాల్గొన్నారు.