చెవిరెడ్డీ అవాస్తవాలు మానుకో
ABN , Publish Date - Mar 13 , 2025 | 02:30 AM
‘ఎన్నికల అధికారిపై దౌర్జన్యం నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన పిర్యాదు మేరకే వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంలో అతను చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని టీడీపీ ఎర్రగొండ పాలెంనియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్నికల కమిషన్ ఫిర్యాదు మేరకే కేసు నమోదు
టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
‘ఎన్నికల అధికారిపై దౌర్జన్యం నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన పిర్యాదు మేరకే వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంలో అతను చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని టీడీపీ ఎర్రగొండ పాలెంనియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. గత ఎన్నికల్లో పుల్లలచెరువు మండలంలో పోలింగ్ ప్రశాం తంగా జరుగుతుండగా చెవిరెడ్డి వచ్చి ఓటమి భయంతో హడావుడి చేశారని తెలిపారు. ఆయన దౌర్జన్యానికి పాల్పడినందునే పోలీ సులు కూడా గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల అధికారిగా ఉన్న మహి ళపై దాడికి పాల్పడినం దునే రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పట్లోనే చెవిరెడ్డిపై కేసు పెట్టిందని తెలిపారు. నిజంగా రాష్ట్రప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి ఇరికించాలనుకుంటే చెవిరెడ్డి ఎప్పుడో జైలులో ఉండేవారని వ్యాఖ్యానించారు. చేసిన తప్పునకు శిక్ష అనుభవించాల్సింది పోయి తప్పుడు ప్రచారాలు చేయడం చెవిరెడ్డి మానుకుంటే మంచిదని హెచ్చరించారు.