రెండు హాస్టళ్ల భవనాలకు రూ.12 కోట్లు
ABN , Publish Date - Mar 13 , 2025 | 02:31 AM
జిల్లాలో కాలేజీ బాలికల వసతి గృహాల నిర్మాణానికి రూ.12కోట్లు మంజూరయ్యాయి. ఒంగోలు, ఎర్రగొండపాలెంలలో ఒక్కో చోట రూ.6కోట్లు వెచ్చించి సొంత భవనాలు నిర్మించనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డాక్టర్ డోలా శ్రీబాలవీరాం జనేయస్వామి చొరవతో జిల్లాకు ఈ నిధులు మంజూరయ్యాయి.

మంత్రి స్వామి చొరవతో మంజూరు
ఒంగోలు, ఎర్రగొండపాలెంలో నిర్మాణం
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
జిల్లాలో కాలేజీ బాలికల వసతి గృహాల నిర్మాణానికి రూ.12కోట్లు మంజూరయ్యాయి. ఒంగోలు, ఎర్రగొండపాలెంలలో ఒక్కో చోట రూ.6కోట్లు వెచ్చించి సొంత భవనాలు నిర్మించనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డాక్టర్ డోలా శ్రీబాలవీరాం జనేయస్వామి చొరవతో జిల్లాకు ఈ నిధులు మంజూరయ్యాయి. రాష్ట్రం మొత్తం 25 వసతి గృహ భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల కాగా అందులో రెండు జిల్లాకు వచ్చాయి. ఒంగోలులో పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో ఈ హాస్టల్ భవనాన్ని నిర్మించనున్నారు. ఎర్రగొండపాలెంలో బాలికల హాస్టల్ భవన నిర్మాణానికి దశాబ్దకాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు మంత్రికి ప్రత్యేక విజ్ఞప్తి చేయడంతో ఆయన ఇక్కడ హాస్టల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఆ మేరకు బుధవారం సాయంత్రం సచివాలయంలో మంత్రి స్వామిని కలిసి ఎరిక్షన్‌బాబు ధన్యవాదాలు తెలిపారు.