Share News

అప్రమత్తతతోనే సైబర్‌ నేరాల నియంత్రణ

ABN , Publish Date - Apr 06 , 2025 | 02:06 AM

నిరంతరం అప్రమత్తంగా ఉండడంతోనే సైబర్‌ నేరాలను నియం త్రణ సాధ్యపడుతుందని మార్కాపురం డీఎస్పీ డాక్టర్‌ యు.నాగరాజు అన్నారు.

అప్రమత్తతతోనే సైబర్‌ నేరాల నియంత్రణ

మార్కాపురం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): నిరంతరం అప్రమత్తంగా ఉండడంతోనే సైబర్‌ నేరాలను నియం త్రణ సాధ్యపడుతుందని మార్కాపురం డీఎస్పీ డాక్టర్‌ యు.నాగరాజు అన్నారు. ఆయనతో డివిజన్‌ పరిధిలోని పలు అంశాలపై జరిపిన ‘ముఖాముఖి’లో వివరాలు వెల్లడించారు.

ప్రశ్న: సైబర్‌ నేరాల నియంత్రణకు పోలీసుశాఖ ఎంత కసరత్తు చేస్తున్నా ఎందుకు ఉధృతి తగ్గడం లేదు?

డీఎస్పీ : సాంకేతిక పెరగడంతో పాటు దాన్ని దుర్విని యోగం చేసేవాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. సాంకే తికతను అడ్డుపెట్టుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే వాళ్లకు కొదవలేకుండా పోతోంది. ముఖ్యంగా గతంలో కొన్ని పద్ధతుల ద్వారా సైబర్‌ నేరాలకు పాల్పడేవాళ్లు. వాటికి అడ్డుకట్ట వేసేసరికి ఇప్పుడు కొత్తపందాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు ఓటీపీలు అడిగితే ఎవరైనా చెబితే బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టే వాళ్లు. కానీ ఇప్పుడు ఒక చిన్నపాటి లింక్‌ పంపి కూడా ఖాతాల్లో డబ్బులు దోచేస్తున్నారు. అంతేకాక ఫోన్‌లు హ్యాక్‌చేసి వ్యక్తిగత సమాచారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల్ని నానా ఇబ్బందులకు గురిచేస్తు న్నారు. వీటన్నింటికీ శాశ్వతపరిష్కారం అనేది ఉండదు నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉండడం తోనే వాటికి అడ్డుకట్ట పడుతుంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసుశాఖ సైబర్‌ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది.

ప్రశ్న: గంజాయి వినియోగం ఎక్కువగా ఉంది. కట్టడికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?

డీఎస్పీ : గతంతో పోల్చితే గంజాయిపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే గంజాయి అమ్మకందారులను గుర్తించి కేసులు నమోదు చేశాం. గంజాయికి అలవాటుపడ్డ కొందరు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుని సేవి స్తున్నట్లు సమాచారం ఉంది. వారిపై కూడా దృషి ్టపెట్టాం తప్పకుండా గంజాయి విక్రయాలను, వినియోగాన్ని నియంత్రిస్తాం.

ప్రశ్న: ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?

డీఎస్పీ : ఒకప్పటితో పోల్చితే నేడు వాహనాల సంఖ్య కొన్ని రెట్లు పెరిగింది. కానీ అదే సమయంలో రహదారులు మాత్రం కుంచించుకు పోతున్నాయి. ఇప్పటికే మార్కాపురం పట్టణంలో ప్రధాన రహదారు ల్లో ఆక్రమణల తొలగింపు వలన ప్రస్తుతం కొంతమేర ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పాయి. డివిజన్‌లోని ఇతర పట్టణాల్లో కూడా ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయితీ అధికారులు చొరవచూపి ఆక్రమణల తొలగింపు చేపడితే ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

ప్రశ్న: రహదారి ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?

డీఎస్పీ : డివిజన్‌ పరిధిలోని జాతీయ రహదారు లపైనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రవాణశాఖతో కలిసి ఇప్పటికే బ్లాక్‌స్పాట్స్‌ గుర్తించాం. వేకువజామున జరిగే ప్రమాదాలతోనే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటోంది. అదేవిధంగా టూవీలర్‌ వాహనా లపై జరిగే ప్రమాదాల్లో హెల్మెట్‌ లేకపోవడంతోనే ఎక్కువశాతం మరణాలు నమోదవుతున్నాయి. డివిజ న్‌ పరిధిలో హెల్మెట్‌ వాడకంపై ప్రత్యేకడ్రైవ్‌లు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. వాహనదారులు హెల్మెట్‌ ను తప్పక ధరించేలా చర్యలు తీసుకుంటున్నాం.

ప్రశ్న: చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లు ఎక్కువయ్యాయి. నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?

డీఎస్పీ: దొంగతనాలకు సంబందించి డివిజన్‌ పరిధిలో పెండింగ్‌ కేసులు దాదాపు పరిష్కరించాం. దొంగతనాలు జరగకుండా పట్టణాల్లో రాత్రి గస్తీ కూడా పక్కాగా జరుగుతోంది. తాళాలు వేసి ఉన్న ఇళ్లలోనే చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కువ రోజులపాటు ఊర్లు వెళితే పోలీసుస్టేషన్‌లో తప్పక సమాచారం ఇవ్వాలి. ఆయా ఇళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెడతారు. అంతేకాక వేసవిలో ఆరుబయట నిద్రించడాన్ని దొంగలు అవకాశంగా మలుచుకునే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ప్రశ్న: బెట్టింగ్‌ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?

డీఎస్పీ : డివిజన్‌ పరిధిలో ఆర్గనైజ్డ్‌ బెట్టింగ్‌ ఎక్కడా జరగడంలేదు. ఎక్కువగా యువత మొబైల్‌లో యాప్‌ ల ద్వారా బెట్టింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ నేపథ్యంలో అన్ని పోలీసు స్టేషన్‌లను అప్రమత్తం చేశాం. గతంలో బెట్టింగ్‌లకు పాల్పడి కేసుల్లో ఉన్నవారికి కౌన్సిలింగ్‌లు నిర్వహిం చాం. బెట్టింగ్‌పై డివిజన్‌ పరిధిలో ప్రత్యేక దృష్టిపెట్టి నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Apr 06 , 2025 | 02:06 AM