Share News

ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించాలి

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:44 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిఽధిలో పనిచేసే వైద్యాఽధికారులు ప్రాథమిక దశలోనే వ్యాధులు గు ర్తించేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు ఆదేశించారు.

ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించాలి

డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిఽధిలో పనిచేసే వైద్యాఽధికారులు ప్రాథమిక దశలోనే వ్యాధులు గు ర్తించేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు ఆదేశించారు. స్థానిక పశుసంవర్థక శాఖ సమావేశపు హాలులో బుధవారం వైద్యాధి కారులు, స్టాఫ్‌ నర్సుల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఓరల్‌ కన్ను, చెవి, మొక్కు, నాలుక అత్యవసర చికిత్స, వృద్ధాప్య రక్షణపై ప్రత్యేక దృ ష్టి సారించాలన్నారు. ఆ వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో వైద్యచికిత్స అందించ డం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. శిక్షణ సమయంలో నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను విధిగా పాటించి తమ పరిధిలోని సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవా లు నిర్వహించి ఆ వివరాలను డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ వైద్యసేవ పోర్టర్‌లో నమోదు చేయాలని చెప్పా రు. డీపీఎంవో డాక్టర్‌ టి.వాణిశ్రీ మాట్లాడుతూ ప్రతి విడతలో 60 మంది వైద్యాధికారులు, స్టాఫ్‌ నర్సులకు శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో టీ వోటీ డాక్టర్‌ సువర్ణరాజు, డాక్టర్‌ హకీమ్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:44 AM