Share News

ప్రమాదాలు జరిగితేనే స్పందిస్తారా?

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:12 AM

పంట పొలాల్లో సాగు చేసుకుంటు, నీటీ తడులు పెట్టుకుంటూ వారి పనిలో నిమగ్నమై ఉంటారు రైతాంగం.

ప్రమాదాలు జరిగితేనే స్పందిస్తారా?

ఎర్రగొండపాలెం రూరల్‌ ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): పంట పొలాల్లో సాగు చేసుకుంటు, నీటీ తడులు పెట్టుకుంటూ వారి పనిలో నిమగ్నమై ఉంటారు రైతాంగం. అలాంటి రైతులు ఏప్పుడు ఏ ప్రమాదం ముంచుకోస్తుందో తెలియక బిక్కుబిక్కు మంటూ బ్రతకాల్సిన పరిస్ధితి విద్యుత్‌ శాఖ అధికారులు తీసుకోస్తున్నారు. ఎర్రగొండపాలెం మండలంలోని గురిజేపల్లి, అమానిగుడిపాడు, బోయలపల్లి, చెర్లోతాండా తదితర గ్రామాలలో చాలా చోట్ల విద్యుత్‌ స్థంభాలు వరిగి (కింద పడిపోయేందుకు) ఉన్నాయి. ఇటివల కురిసిన వర్షానికి అమానిగుడిపాడు, వాదంపల్లి, గురిజేపల్లి తదితర గ్రామాలలో విద్యుత్‌ స్థంభాలు కిందపడిపోయాయి. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ స్థంభాలను గుర్తించి వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాల్సిన విద్యుత్‌ శాఖ అధికారులు పట్టిపట్టనట్లు ఉంటున్నారు. దీనితో ఆ ప్రమాదం జరిగితేనే మేము వస్తాం స్పందిస్తాము అన్నట్లు అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చాలా ఉన్నాయి. అందుకు ఉదాహరణే ఇటీవల వర్షానికి పడిపోయిన స్థంభాలు. దీనితో రోజుల తరపడి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటం. నేటికి ఎర్రగొండపాలెం, మిల్లంపల్లి సబ్‌ స్టేషన్‌ పరిధిలో అంతరాయం ఏర్పడతునే ఉంది. అసలే వేసవి కాలం కావడంతో విద్యుత్‌ సరఫరా అంతరాయం కలగడంతో అధికారులపై మండల ప్రజలు, రైతులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అదే ముందుగా గుర్తించి ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదు కదా అంటున్నారు ప్రజలు.

చేతికందే ఎత్తులో విద్యుత్‌ తీగలు..

పట్టణ, గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా విద్యుత్‌ తీగలు చేతికి అందే ఏత్తులో ప్రమాదక రంగా ఉన్నాయి. ముఖ్యంగా పంట పొలాల్లో, నీవాస ప్రాంతాలలో చాల చోట్ల ఇలాగే ఉన్నాయి. విద్యుత్‌ శాఖ అదికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని రైతులు, మండల ప్రజలు చెబుతున్నారు. దానికి తోడు విద్యుత్‌ తీగలు పాతకాలం నాటివి కావడంతో గాలులకు మంటలు వ్యాప్తి చెందుతున్నాయని అంటున్నారు. వేసవి కాలం కావడంతో ఏదైన ప్రమాదం జరగకముందే స్పందించి ప్రమాదకరంగా కిందకు ఉన్న విద్యుత్‌ తీగలను మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాలపై విద్యుత్‌ శాఖ ఏఈ అల్లురయ్యను వివరణ కోరగా పరిశీలించి మార్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

Updated Date - Apr 08 , 2025 | 01:12 AM