చలివేంద్రాల ఏర్పాటు
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:28 PM
పంగులూరులోని ప్రధాన కూడళ్లలో సోమవారం మూడు చలివేంద్రాలను ఎంపీడీవో స్వరూపారాణి ప్రారంభించారు. బస్ స్టాండ్ సెంటర్‌తో పాటు శేణుగోపాలస్వామి ఆలయం, మరో బస్ షెల్టర్ వద్ద వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ వారు ప్రజల దాహార్తిని తీర్చేందుకు వీటిని ఏర్పాటు చేశారు.

పంగులూరు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : పంగులూరులోని ప్రధాన కూడళ్లలో సోమవారం మూడు చలివేంద్రాలను ఎంపీడీవో స్వరూపారాణి ప్రారంభించారు. బస్ స్టాండ్ సెంటర్‌తో పాటు శేణుగోపాలస్వామి ఆలయం, మరో బస్ షెల్టర్ వద్ద వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ వారు ప్రజల దాహార్తిని తీర్చేందుకు వీటిని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ సుమంత్, టీడీపీ నేతలు మేడ సుబ్బారావు, చిలుకూరి కోటయ్య, గుడిపూడి రామారావు, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, సంధ్య, పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వడగాలులపై జాగ్రత్తలు పాటించండి : తహసీల్దార్ గోపీకృష్ణ
చీరాల : ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వేడి గాలుల ప్రభావం నుంచి జాగ్రత్తలు పాటించాలని తహసీల్దార్ గోపీకృష్ణ పేర్కొన్నారు. సోమవారం కార్యాలయం ప్రాంగణంలో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉంచేందుకు చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వేడి గాలుల తీవ్రతను సిబ్బందికి వివరించి, తీసుకోవలసిన జాగ్రత్తతలను తెలిపారు. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.