Share News

అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:35 AM

ప్రజలు అప్రమత్తతతో ఉంటే అగ్ని ప్రమాదాలు నివా రించవచ్చని మార్కాపురం అగ్నిమాపక శాఖ అధికారి రామకృష్ణ అన్నారు.

అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ

మార్కాపురం వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 15 ఆంధ్రజ్యోతి: ప్రజలు అప్రమత్తతతో ఉంటే అగ్ని ప్రమాదాలు నివా రించవచ్చని మార్కాపురం అగ్నిమాపక శాఖ అధికారి రామకృష్ణ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు పురస్క రించుకుని స్థానిక సుందరయ్య కాలనీలో మంగళ వారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్లల్లో సంభవించే గ్యాస్‌ లీకేజీలు, వాటి నివారణ, వివిధ అగ్నిప్రమాదాల కారకాలు నివారణ ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ప్రజలతో నివా రణ చర్యలు కూడా చేయించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

కంభం : కంభం అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా అగ్నిమాపక శాఖాధికారి పిచ్చయ్యచౌదరి కంభం ఆర్టీసీ బస్టాం డ్‌లో ప్రయాణికులకు కరపత్రాలను పంపిణీ చేయడమేకాక అగ్ని ప్రమాదా లు జరిగినపుడు తీసుకోవలసిన జాగ్ర త్తలను వివరించారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : వేసవి ఎండల తీవ్రత పెరగడంతో ఉష్ణోగ్రతలు పెరిగి అగ్నిప్రమాదాలు సంభవించే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక కేంద్రం అధి కారి మాల్యాద్రి తెలిపారు. ఎర్రగొండపాలెంలోని చైతన్య హైస్కూల్‌ లో మంగళవారం అగ్నిప్రమాదాలు జరిగినపుడు, గ్యాస్‌ సిలెండరు నుంచి మంటలు వ్యాపించిన సమయంలో మంటలు అదుపుచేసే విధా నంపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం సంబవించిన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆంజనేయులు, హెచ్‌ఎం ఈశ్వరీ, పైర్‌సిబ్బంది పాల్గొని విద్యార్ధులకు అవగాహన కల్పించారు.

పెద్దదోర్నాల : అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి హరిబాబు అన్నారు. స్థానిక ఆర్‌టీసీ బస్టాండ్‌, సినిమా హాలు, సుందరయ్య కాలనీల్లో అగ్నిప్రమాదాల నివారణ, తీసుకోవాలసిన జాగ్రత్తలపై మంగళవారం ప్రయోగాత్మకంగా అవగా హన కల్పించారు. ఈ సంధర్భంగా హరిబాబు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల మహిళలు పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. వంటగదిలో కాటన్‌ చీరలు ధరించాలని వంటగదికి గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలని, సిలెండరు నుంచి గ్యాస్‌ లీక్‌ కాకుండా జాగ్రత్త పడాలన్నారు. అనుకోని ప్రమాదం ఏర్పడినప్పుడు అగ్నిమాపక కేంద్రానికి వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. పలు సూచనలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు.

Updated Date - Apr 16 , 2025 | 01:35 AM