తాగునీటి సమస్య పరిష్కారానికి నిధుల మంజూరు
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:11 AM
పట్ట ణంలో శాశ్వతంగా నీటి సమస్య పరష్కరించేందుకు ప్రభుత్వం రూ.153.24 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు.

గిద్దలూరుటౌన్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): పట్ట ణంలో శాశ్వతంగా నీటి సమస్య పరష్కరించేందుకు ప్రభుత్వం రూ.153.24 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. ఇటీవల ప్రభుత్వం ఇందుకు సంబంధించి జీవోను విడుదల చేసిందన్నారు. ఏఐఐబీ ప్రాజెక్టు ద్వారా ఈపథకాన్ని రూపకల్పన చేస్తున్నట్లు, ఇందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఇందుకు సంబంధించి జిల్లా పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఎస్‌ఈ మోహన్, ఈఈ సంజయ్, డీఈ ఆదామ్‌షఫి, మున్సిపల్ కమిషనర్ ఐ.శ్రీనివాసులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పట్టణానికి నీటి అవసరాల గురించి, వాటి లభ్యత, నీటి సరఫరాను చేయడానికి అవసరమైన రూటుమ్యాప్‌పై అధికారు లతో చర్చించారు. ఈ ప్రాజెక్టు వలన పట్టణ ప్రజల కు శాశ్వతంగా నీటి సమస్య ఉండదని, నిరంతరం పట్టణ ప్రజలకు నీరు అందించేందుకు ఉపయోగ పడుతుందన్నారు.
బండలాగుడు పోటీలు ప్రారంభం
గిద్దలూరుటౌన్ : శ్రీరామనవమి సందర్భంగా మండలంలోని ముండ్లపాడు రోడ్డులోని అభయాంజ నేయస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బలప్రదర్శన పోటీలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కృష్ణకిషోర్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, టీడీపీ నాయ కులు అంబవరం శ్రీనివాసరెడ్డి, నంది శ్రీను పాల్గొన్నారు.
ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు
గిద్దలూరుటౌన్ : వేసవిలో పాదాచారులు, ప్రజలు తాగునీటి ఇబ్బందులను తొలగిం చేందుకే చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మె ల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగర పంచాయతీ ఆధ్వర్యంలో పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం, కుమ్మరాంకట్ట, రైల్వేస్టేషన్, ఆర్టీసి బస్టాండ్ల సమీపంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి రిబ్బన్‌కట్ చేసి ప్రారంభించారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుం డడంతో వాహనదారులు, పాదాచారులు నీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. వేసవిలో ప్రజలు తాగునీరు ఎక్కువగా తాగాలని, చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, కమీషనర్ ఐ.శ్రీనివా సులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.