ఇన్‌చార్జ్ డీసీవోగా ఇందిరాదేవి
ABN , Publish Date - Apr 16 , 2025 | 02:21 AM
జిల్లా సహకార శాఖ ఇన్‌చార్జి అఽధికారిగా ఎన్.ఇందిరాదేవి నియమితులయ్యారు. సహకారశాఖ డివిజనల్ అధికారి హోదాలో ఉన్న ఆమె ప్రస్తుతం పీడీసీసీ బ్యాంకు లీగల్ విభాగంలో ఓఎస్‌డీగా పనిచేస్తున్నారు.

పూర్తి అదనపు బాధ్యతలతో నియామకం
ఒంగోలు, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకార శాఖ ఇన్‌చార్జి అఽధికారిగా ఎన్.ఇందిరాదేవి నియమితులయ్యారు. సహకారశాఖ డివిజనల్ అధికారి హోదాలో ఉన్న ఆమె ప్రస్తుతం పీడీసీసీ బ్యాంకు లీగల్ విభాగంలో ఓఎస్‌డీగా పనిచేస్తున్నారు. ఇక్కడ డీసీవోగా పనిచేస్తున్న బి.శ్రీనివాసరెడ్డిపై అధికారపార్టీ కీలక ప్రజాప్రతినిధుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. ఆయన పనితీరుపై కలెక్టర్ తమీమ్ అన్సారియా సైతం అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు వారాల క్రితం శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉండగా, ఇందిరాదేవిని పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్‌ఏసీ)తో డీసీవోగా నియమిస్తూ కలెక్టర్ ఉత్వర్వులు ఇచ్చారు. దీంతో మంగళవారం సాయంత్రం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. రెగ్యులర్ డీసీవోగా మరొకరిని ప్రభుత్వం నియమించే వరకు ఇందిరాదేవి ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.