భూముల రీ-సర్వే ప్రారంభం
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:21 AM
రైతులు రీ-సర్వేలో పాల్గొని సమస్యలకు పరిష్కారం పొందాలని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మండల పరిధిలోని కావూరివారి పాలెంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా, హద్దులు, తదితర సమస్యలకు సర్వేలో వేగంగా పరిష్కారం ఉంటుందని చెప్పారు.

సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు
కావూరివారిపాలెం(చీరాల), ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : రైతులు రీ-సర్వేలో పాల్గొని సమస్యలకు పరిష్కారం పొందాలని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మండల పరిధిలోని కావూరివారి పాలెంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా, హద్దులు, తదితర సమస్యలకు సర్వేలో వేగంగా పరిష్కారం ఉంటుందని చెప్పారు. అందుకు సంబంధించి శుక్రవారం గవినివారిపాలెంలో నిర్వహించే గ్రామ సభలో భూ యజమానులు పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో డీటీ అర్జున్, వీఆర్వో సోమయ్య, స్థానికులు పాల్గొన్నారు.
రైతులు సహకరించాలి
మార్టూరు : రైతులు రీసర్వేపై పూర్తి అవగాహనతో ఉండాలని, అధికారులకు సహకరించాలని ఆర్డీవో గ్లోరియా అన్నా రు. గురువారం యద్దనపూడి మండలంలోని యనమదల,పోలూరు గ్రామాలలో రీసర్వేపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా పోలూరు గ్రామం లో ఏర్పాటుచేసిన గ్రామ సభకు ఆర్డీవో గ్లోరియా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె గ్రామ సభలో మాట్లాడుతూ గ్రామాలలో రైతులు భవిష్యత్‌లో ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం రీసర్వే నిర్వహిస్తున్నదన్నారు.రైతులు సహకరించాలని,వారి భూములు,పొలాలవివరాలును సక్రమంగా నమోదు చేయించుకోవాలన్నారు. అంతకుముందు గ్రామ సచివాలయం వద్ద తహసీల్దార్ కే రవికుమార్ ఆధ్వర్యయుంలో అవగా హ న ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో రీసర్వే డీటీ విష్ణుప్రసాద్, మండల సర్వేయర్ సాంబశివరావు, పలువురు సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నాయకులు రావిపాటి సీతయ్య పాల్గొన్నారు.
పంగులూరు : మండలంలోని కొండమూరు, బూదవాడ గ్రామాలలో భూ ముల రీసర్వే ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గురువారం రెండు గ్రామాలలో తహసీలార్ సింగారావు నేతృత్వంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగారావు మాట్లాడుతూ ఈ ఏడాది తొ లివిడతగా బైటమంజులూరులో రీ-సర్వే చేపట్టి కొనసాగిస్తున్నామన్నారు. కొండమూరు, బూదవాడ గ్రామాలలో గురువా రం నుంచి రీసర్వే ప్రక్రియకు శ్రీకారం చు ట్టామన్నారు. రీసర్వే ప్రక్రియ పూర్తి చే సేందుకు వీఆర్వోలు, సర్వేయర్లు, వీఆర్‌ఏలతో ఒక్కో గ్రామానికి మూడు బృందాలను నియమించినట్లు తెలిపారు. అవగాహన ర్యాలీలో తహసీల్దార్ సింగారావు, డీటీ శ్రీనివాసరావు, మండల సర్వేయర్ సురే్‌షబాబు, ఆర్‌ఐ శ్వేత, గ్రామ నేతలు అంజయ్య, కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, వీఆర్‌ఏలు, రైతులు పాల్గొన్నారు.
పర్చూరు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ పి.బ్రహ్మయ్య అన్నారు. గురువారం మండలం నూతలపాడులో రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్ డీటీ, సర్పంచ్ చిన్నయ్య, మండల సర్వేయర్, వీఆర్వోలు, వీఎ్‌సఎస్ లు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
చినగంజాం : గ్రామాల్లో నిర్వహిస్తున్న రీ సర్వేని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు అన్నారు. మండలంలోని చినగం జాం, సంతరావూరు గ్రామాల్లో రీసర్వే ప్రారంభోత్సవ ర్యాలీలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రీ సర్వేపై రైతులకు ముందుగా సమాచారం తెలియజేస్తామ న్నారు. సర్వే సమయంలో తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. కార్యక్రమం లో చినగంజాం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లు రా యని ఆత్మారావు, చెరుకూరి రాఘవయ్య, గ్రామ రెవెన్యూ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వీఆర్‌ఏలు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఇంకొల్లు : భూ సర్వేను విని యోగించుకోవాలని తహసీల్దార్ వెంక టరత్నం తెలిపారు. గురువారం అవ గాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం లో హనుమంతరావు, సాంబయ్య,మార్క్ రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.