AI Image Generation: యువకుడి నుంచి ఫ్లాష్ ఫార్వర్డ్.. 2075లో మీరెలా కనిపిస్తారో తెలుసా..
ABN , Publish Date - Apr 10 , 2025 | 06:23 PM
ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఎలాంటి చిత్రం కావాలన్నా కూడా క్షణాల్లోనే వచ్చేస్తుంది. ప్రస్తుతం మీరు యువకుడిగా ఉండి, 40 ఏళ్లు లేదా వృద్ధాప్యంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలని ఉందా. అయితే ఈ చాట్ జీపీటీ ద్వారా ఎలా చేయాలనేది ఇక్కడ చూద్దాం.

ఏఐ పుణ్యామా అని ఇప్పటి టెక్ యుగంలో ఫోటోల క్రియేషన్ మరింత సులభమైంది. ఇప్పుడు మీరు యువకుడిగా ఉండి మిర్రర్ చూసుకున్న రోజులు ఇంకొన్ని రోజుల తర్వాత మారిపోతాయి. అయితే మీరు 40 ఏళ్లు లేదా 50, 60 ఏళ్ల వయస్సులో ఎలా ఉంటారనేది కూడా ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు. అందుకోసం చాట్ జీపీటీ (ChatGPT) ద్వారా వీటిని ఎలా క్రియేట్ చేసుకోవచ్చనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్రమంలో మీరు ముందుగా చాట్ జీపీటీ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఆటాచ్ ఆప్షన్ సెలక్ట్ చేసి మీ క్లియర్ ఫోటోను అప్‌లోడ్ చేయండి. మొహం స్పష్టంగా కనిపించాలి.
50 ఏళ్ల వెర్షన్‌గా
ఇప్పుడు ChatGPTకి మీరు ఏ వయసులో కనిపించాలనుకుంటున్నారో చెప్పండి. ఆ క్రమంలో కొన్ని ఫన్నీ ప్రాంప్ట్‌లు కూడా ఇవ్వవచ్చు. నా ఫోటో వృద్ధుడి మాదిరిగా చేయాలని టైప్ చేసి తెలపండి. దీంతోపాటు మీరు 40 ఏళ్లలో మామూలు టీచర్‌లా కనిపిస్తానా లేదా నా ఫోటోని 50 ఏళ్ల వెర్షన్‌గా మార్చాలని తెలపండి. పక్కన కాఫీతో అంటూ ఇలా అనేక ప్రాంప్ట్‌లు ఇచ్చుకోవచ్చు.
మీరు ఇచ్చిన ప్రాంప్ట్‌ల ఆధారంగా మీకు కొన్ని సెకన్లలోనే ఫోటో ప్రత్యక్షమవుతుంది. దీంతోపాటు మీరు ఏఐకి మంచి క్వాలిటీ ఫోటో కావాలని తెలుపవచ్చు. నేను జంక్ ఫుడ్ తినను, వాకింగ్ చేస్తాను అంటే మీరు 60లో కూడా స్టైలిష్‌గా కనిపిస్తారు. అలాంటి ప్రాంప్ట్‌లు కూడా ఇవ్వవచ్చు. నా మీసాలు మాత్రం మార్చవద్దు. జుట్టు గ్రే అవ్వచ్చు. కానీ పడిపోవద్దని స్పెసిఫిక్స్ కూడా అందించవచ్చు. అలా చేయడం ద్వారా మీ చిత్రం మరింత స్పష్టంగా వచ్చే ఛాన్సుంది.
కానీ డేటా షేరింగ్ మాత్రం
వచ్చిన చిత్రాలను మీరు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి పంపించుకోవచ్చు. ఇదే నా 50 ఏళ్ల ఫేస్ అని వాట్సప్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. మీ ఫ్రెండ్‌ని తన 60 ఏళ్ల లుక్ టెస్ట్ చేసుకోవాలని ట్యాగ్ చేసి అడగవచ్చు. ఇప్పటికే ఇలాంటి చిత్రాలను అనేక మంది వారి ముఖాలతో క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఫీచర్ సరదాగా ఉండటంతో అనేక మంది వినియోగిస్తున్నారు. కానీ AI సాధనాల్లో వ్యక్తిగత డేటా విషయంలో ఓ రిస్క్ కూడా ఉంది. మీరు అప్‌లోడ్ చేసిన ఫోటోలు ఎక్కడ నిల్వ చేయబడతాయో, ఎవరికి కనిపిస్తాయో స్పష్టంగా తెలియదు. కాబట్టి డేటా షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఇవి కూడా చదవండి:
TCS: ఫలితాల్లో టీసీఎస్ విఫలం.. కానీ డివిడెండ్ రూ.30 ప్రకటన
Gold Price Fluctuations: అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది..కారణాలేంటి
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Read More Business News and Latest Telugu News