Share News

కొత్త బ్రిడ్జితో తీరిన కష్టాలు

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:25 AM

శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణంతో పలు గ్రామాల కష్టాలు తీరాయి. తిమ్మాయపాలెం-ఇలపావులూ రు ఆర్‌అండ్‌బీ రోడ్డులో అద్దంకి మం డలం పేరాయపాలెం వద్ద శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి మూడున్నర సంవత్సరాల కిందట కూలింది. వైసీపీ హయాంలో ఎలాంటి నిధులు కేటాయించకపోవడం తో అద్దంకి మండలంలోని పేరాయపా లెం, ధేనువకొండ, ఉమ్మనేనివారిపాలం లతో పాటు చీమకుర్తి, తాళ్లూరు మండలాలలోని పలు గ్రామాల నుంచి అద్దంకి కి రాకపోకలు నిలిచిపోయాయి.

కొత్త బ్రిడ్జితో తీరిన కష్టాలు
పేరాయపాలెం వద్ద దోర్నపు వాగుపై నిర్మించిన బ్రిడ్జి

అద్దంకి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణంతో పలు గ్రామాల కష్టాలు తీరాయి. తిమ్మాయపాలెం-ఇలపావులూ రు ఆర్‌అండ్‌బీ రోడ్డులో అద్దంకి మం డలం పేరాయపాలెం వద్ద శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి మూడున్నర సంవత్సరాల కిందట కూలింది. వైసీపీ హయాంలో ఎలాంటి నిధులు కేటాయించకపోవడం తో అద్దంకి మండలంలోని పేరాయపా లెం, ధేనువకొండ, ఉమ్మనేనివారిపాలం లతో పాటు చీమకుర్తి, తాళ్లూరు మండలాలలోని పలు గ్రామాల నుంచి అద్దంకి కి రాకపోకలు నిలిచిపోయాయి. అద్దంకి-ధేనువకొండ బస్‌ సర్వీస్‌ ను కూడా రద్దు చేశారు. గ్రామస్థులు తాత్కాళికంగా మరమ్మతులు చేసుకున్నా బిక్కుబిక్కు మం టూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొం ది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రత్యేక దృష్టి సారించి సుమారు40 లక్షల రూపాయల వ్యయంతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయింప జేశారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో రాకపోకలు పునరుద్ధరణ అయ్యాయి. ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 06 , 2025 | 12:26 AM