Share News

త్వరలో రేషన్‌ స్మార్ట్‌ కార్డులు

ABN , Publish Date - Apr 03 , 2025 | 02:21 AM

రేషన్‌ కార్డుల స్థానంలో స్మార్ట్‌ కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు ఇచ్చే సరుకులు పక్కదారి పట్టకుండా ఉండటమే ప్రధాన లక్ష్యంతో అనేక మార్పులకు నాంది పలికింది. అందుకోసం ఇప్పటి వరకు ఉన్న రేషన్‌ కార్డుల స్థానంలో స్మార్ట్‌కార్డులు (ఏటీఎం సైజు) కార్డుదారులకు ఇచ్చేందుకు అంతా సిద్ధం చేసిం ది.

త్వరలో రేషన్‌ స్మార్ట్‌ కార్డులు

ఈకేవైసీ పూర్తయిన తర్వాత ప్రక్రియ చేపట్టే అవకాశం

ఒకేసారి కార్డుల్లో చేర్పులు, మార్పులు, తొలగింపులు

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : రేషన్‌ కార్డుల స్థానంలో స్మార్ట్‌ కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు ఇచ్చే సరుకులు పక్కదారి పట్టకుండా ఉండటమే ప్రధాన లక్ష్యంతో అనేక మార్పులకు నాంది పలికింది. అందుకోసం ఇప్పటి వరకు ఉన్న రేషన్‌ కార్డుల స్థానంలో స్మార్ట్‌కార్డులు (ఏటీఎం సైజు) కార్డుదారులకు ఇచ్చేందుకు అంతా సిద్ధం చేసిం ది. రాష్ట్రంలో గతేడాది నుంచి రేషన్‌ కార్డుల్లో చేర్పులు, మార్పులు, తొలగింపులు వంటివి చేపట్టలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్రక్రియను కూడా వారం పదిరోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలో 6.61 లక్షల రేషన్‌కార్డుల పరిధిలోని సభ్యుల నుంచి ఈకేవైసీ చేపట్టిన ప్రభుత్వం ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తిచేసే విధంగా దిశానిర్దేశం చేసింది. ప్రస్తుతం పంపిణీ జరుగుతుండగా అక్కడే లేని వారికి ఈకేవైసీ చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే కార్డుల్లో చేర్పులు, మార్పులతోపాటు తొలగింపులు చేసేందుకు ప్రభుత్వం అప్షన్లు ఇవ్వనుంది. ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో స్మార్ట్‌కార్డులను ఇవ్వనున్నారు. ఈ కార్డులో ఇంటి కుటుంబసభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది ఫొటోలు కూడా ఉండటంతోపాటు పూర్తి అడ్రసు కూడా ఉంటుంది. ప్రస్తుతం అన్నింటిని రేషన్‌ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్న పరిస్థితుల్లో ఆ కార్డులను జేబులో పెట్టుకునేందుకు కూడా ఈజీగా ఉంటుంది. ఆ ప్రక్రియ మే నెలల ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటిచడంతో ఆ శాఖ అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు.

Updated Date - Apr 03 , 2025 | 02:21 AM