మొక్కలే లేవు.. అయినా బిల్లులు చెల్లింపులా..
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:55 AM
ఉపాధి హామీ పథకం మండలంలో చేపట్టిన పండ్ల మొక్కల పెంపకం కింద ల బ్ధిదారులకు బిల్లులు చెల్లింపులు చేశారని, అ యితే ఎక్కడా పండ్ల మొక్కల జాడ కని పించలేదని సామాజిక తనిఖీ స్టేట్ రీసోర్స్ ప ర్సన్ రామచంద్రరావు పేర్కొన్నారు.

స్టేట్ రీసోర్స్‌పర్సన్ రామచంద్రరావు
నాగులుప్పలపాడు, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యో తి): ఉపాధి హామీ పథకం మండలంలో చేపట్టిన పండ్ల మొక్కల పెంపకం కింద ల బ్ధిదారులకు బిల్లులు చెల్లింపులు చేశారని, అ యితే ఎక్కడా పండ్ల మొక్కల జాడ కని పించలేదని సామాజిక తనిఖీ స్టేట్ రీసోర్స్ ప ర్సన్ రామచంద్రరావు పేర్కొన్నారు. శుక్రవారం నాగులుప్పలపాడు మండల పరిషత్ కార్యాల యం వద్ద ఉపాధి పనులపై ప్రజావేదిక ని ర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ రీసోర్స్ పర్సన్ మాట్లాడుతూ 2023 మార్చి నుంచి 2024 ఏప్రిల్ వరకు జరిగిన ఉపాధి పనుల ను తనిఖీ బృందాలు పరిశీలన చేసినట్లు చె ప్పారు. ప్రధానంగా పండ్ల మొక్కల పెంపకం సక్రమంగా జరగలేదని, అనేక గ్రామాల్లో కూ లీల మస్టర్లలో సంతకాలు లేకుండా నిశాని అ ని రాసి నగదు చెల్లింపులు చేశారని, మస్టర్లు తక్కువగా ఉండి ఎక్కువ రోజులకు కూలి నగదు చెల్లింపులు జరిగాయని, కొంతమందికి కూలి జమ కాలేదని గుర్తించినట్లు చెప్పారు. అనంతరం పీడీ జోసఫ్‌కుమార్ మాట్లాడుతూ పండ్ల మొక్కలు నాటే సమయంలో తీసిన ఫొటోల నగదు చెల్లింపులు చేస్తారని, అప్పటి మొక్కలు ఇప్పుడు లేవని ఉపాది సిబ్బందిని బాధ్యుతలను చేయడం సరికాదన్నారు. గ్రా మాల్లో ఉపాధి సిబ్బందికి అనేక రకాల విధు లు ఉంటాయని, అందువల్ల సచివాలయ, ఉ ద్యానశాఖ సిబ్బందికి వాటి బాధ్యత అప్పగిం చవచ్చు కదా అని ప్రశ్నించారు. మొత్తం మీద తనిఖీ బృందాలు గుర్తించిన అంశాలపై ప్రజా వేదికలో స్పష్టమైన చర్యలు లేకుండానే ముగి సింది. కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి వండ ర్‌మెన్, ఎంపీడీవో వై.మహాలక్ష్మి, ఏపీవో రవి బాబు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.