ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chittoor: పుత్తూరు- అత్తిపట్టు రైల్వే రూట్‌ మ్యాప్‌ సిద్ధం

ABN, Publish Date - Jan 04 , 2025 | 12:45 PM

పుత్తూరు- అత్తిపట్టు(Puttur- Attipattu) మధ్య రైల్వే లైను రూట్‌ మ్యాప్‌ ప్రాజెక్టు సిద్ధమైంది. 88.30 కిలోమీటర్లు.. సింగిల్‌ విద్యుత్‌ లైను మార్గంలో ఎనిమిది స్టేషన్లను ప్రతిపాదించారు. జిల్లాలో నారాయణవనం, కృష్ణమరాజుకండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం.. తమిళనాడులో ఊత్తుకోట, పాలవ్కాకం, పెరియపాలెం, గంగయాదికుప్పంలో స్టేషన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

- ఏపీ, తమిళనాడులో నాలుగేసి స్టేషన్లు

పుత్తూరు(చిత్తూరు): పుత్తూరు- అత్తిపట్టు(Puttur- Attipattu) మధ్య రైల్వే లైను రూట్‌ మ్యాప్‌ ప్రాజెక్టు సిద్ధమైంది. 88.30 కిలోమీటర్లు.. సింగిల్‌ విద్యుత్‌ లైను మార్గంలో ఎనిమిది స్టేషన్లను ప్రతిపాదించారు. జిల్లాలో నారాయణవనం, కృష్ణమరాజుకండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం.. తమిళనాడులో ఊత్తుకోట, పాలవ్కాకం, పెరియపాలెం, గంగయాదికుప్పంలో స్టేషన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పుత్తూరు రైల్వే స్టేషన్‌ నుంచి నారాయణవనం మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండగా.. మిగిలిన స్టేషన్లు పది కిలోమీటర్ల వంతున ఉన్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Actress Seetha: నటి సీతకు మాతృవియోగం


పర్యాటక కేంద్రమైన కైలాసనాథకోనను దృష్టిలో ఉంచుకుని కృష్ణమరాజుకండ్రిగను కూడా స్టేషన్‌గా ప్రతిపాదించారు. ఇక, పుత్తూరు నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో అంటే నారాయణవనం రైల్వే గేటు- మరాఠీ రైల్వే గేట్ల మధ్య ఈ కొత్త రైల్వే లైను తిరుగుతుందని పేర్కొన్నారు. ఈ రైల్వే మార్గంలో 15 మేజర్‌.. 159 మైనర్‌ వంతెనలు ఉంటాయని ప్రతిపాదించారు. ప్రతిరోజు ప్రయాణికుల కోసం ఆరు బోగీలు వుండే నాలుగు ఈఎంయులు నాలుగు ట్రిప్పులు తిరగనున్నాయి. ఈ విద్యుత్‌ రైళ్లు ఇటు పుత్తూరు- చెన్నై(Puttur-Chennai), అటు సూళ్లూరుపేట-చెన్నై లైన్లలో కలుస్తాయి. దీంతో శ్రీసిటీ వెళ్లే ఉద్యోగులు, చెన్నై, పుత్తూరు(Chennai, Puttur) వెళ్లే వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.


ప్రాజెక్టు ఉద్దేశం

ఈ విద్యుత్‌లైన్‌ వల్ల ప్రధానంగా బళ్లారి నుంచి ఎగుమతయ్యే ఇనుపఖనిజం, దిగుమతయ్యే బొగ్గు రవాణాకు ఉపయోగమౌతుందని ప్రతిపాదించారు. చెన్నై ఓడరేవు మీద పెరిగిన ఒత్తిడిని తగ్గించేందుకు అట్టిపట్టు సమీపంలోని ఎన్నూరు ఓడరేవును ఎంచుకుని ఈ రైలు మార్గంను ప్రతిపాదించారు.

తిరువళ్లూరు- పెరియపాలెం రెండో విద్యుత్‌ లైన్‌

పుత్తూరు-అట్టిపట్టు లైను ప్రాజెక్టు ప్రతిపాదనలోనే తిరువళ్లూరు-పెరియపాలెం మధ్య 28.30 కిలోమీటర్ల మరో చిన్న లైనును అధికారులు ప్రతిపాదించారు. పూర్తిగా తమిళనాడు(Tamilnadu)లోనే వెళ్లే ఈ మార్గంలో కలింబాకం, మేల్‌కొండయార్‌, వెంగల్‌ వంటి మూడు స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ రూట్‌లోనూ ప్రయాణికుల కోసం నాలుగు ట్రిప్పులు విద్యుత్‌ రైళ్లు తిరుగుతాయి


ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట

ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Read Latest Telangana News and National News

Updated Date - Jan 04 , 2025 | 12:45 PM