Srikakulam : సిక్కోలులో సందడిగా.. రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:21 AM
కూటమి ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం వరకూ మూడు రోజులపాటు...

అరసవల్లి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు ఆదివారం సందడిగా ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం వరకూ మూడు రోజులపాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో 5వేల మందితో సూర్యనమస్కారాలు నిర్వహించి.. ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తోపాటు అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, యోగాసాధన, స్వచ్ఛంద, థార్మిక సంస్థల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా గురువు రామారావు ఆధ్వర్యంలో సూర్యనమస్కారాలు చేశారు.
వైభవోపేతంగా ఆదిత్యుని శోభాయాత్ర....
ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆదిత్యుడి శోభాయాత్ర ప్రారంభించారు. శోభాయాత్రలో సుమారు 20వేలమంది పాల్గొన్నారు. సూర్యదేవుని సుందరంగా అలంకరించిన సప్తాశ్వరథంపై ఆశీనులను చేశారు. అనంతరం అన్నవరం సత్యదేవుని రథం, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవారి రథం, వెనుక టూరిజం శకటం, ఐటీడీఏ శకటం, మత్స్యశాఖ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఎయిర్‌పోర్టు, ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శకటాలు కూడా యాత్ర లో పాల్గొన్నాయి. కాగా, సోమవారం అర్ధరాత్రి సూర్యనారాయణస్వామికి క్షీరాభిషేకం నిర్వహిస్తారు. 12 గంటల నుంచి నిజరూప దర్శనంలో స్వామిని చూసేందుకు భక్తులను అనుమతిస్తారు.
తిరుమల్లో రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి
తిరుమలలో మంగళవారం జరగనున్న రథసప్తమి వేడుకకు టీటీడీ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరోజు వేకువజాము నుంచి రాత్రి వరకు మలయప్పస్వామి ఏడువాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...
Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News and Telugu News