Share News

Summer Heat : మండిన రాయలసీమ

ABN , Publish Date - Mar 09 , 2025 | 04:05 AM

రాయలసీమలో శనివారం తీవ్రమైన వేడి వాతావరణం కొనసాగింది. పలుచోట్ల వడగాడ్పులు వీచాయి.

 Summer Heat : మండిన రాయలసీమ

కర్నూలులో 39.4 డిగ్రీలు నమోదు

విశాఖపట్నం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో శనివారం తీవ్రమైన వేడి వాతావరణం కొనసాగింది. పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. గాలిలో తేమ శాతం 30 కంటే తక్కువకు పడిపోయింది. అత్యధికంగా కర్నూలులో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదు కావడంతో రాత్రిపూట చలి పెరిగింది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత కొనసాగి పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Mar 09 , 2025 | 04:05 AM