Share News

ఇన్‌చార్జుల పాలన ఇంకెన్నాళ్లు?

ABN , Publish Date - Mar 18 , 2025 | 01:42 AM

మండలంలోని కీలక శాఖ అయిన రెవెన్యూ శాఖ ఇన్‌చార్జ్‌ ఎలుబడిలోనే కొనసాగుతోంది.

ఇన్‌చార్జుల పాలన ఇంకెన్నాళ్లు?

పుల్లలచెరువు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కీలక శాఖ అయిన రెవెన్యూ శాఖ ఇన్‌చార్జ్‌ ఎలుబడిలోనే కొనసాగుతోంది. .రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేక ప్రజలకు రెవెన్యూ సేవలు అందడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నవంబరు నెలలో తహసీల్దార్‌ గా ఉన్న నయిమ్‌ అహ్మద్‌ సెలవుపై వెళ్లారు. ఆ తరువాత ఇన్‌ చార్జ్‌ బాధ్యతలు తీసుకున్న ఎర్రగొండపాలెం తహసీల్దార్‌ బాలకిషోర్‌ ఓ భూ కుంభకోణంలో ఇరుక్కొని సస్పెండ్‌ అయ్యారు. దీంతో అధికారులు మార్కాపురం తహసీల్దారును ఇన్‌చార్జ్‌గా నియమించడంతో ఆయన అందుబాటులో ఉండ డం లేదు. మార్కాపురం నుంచి పుల్లలచెరువుకు సూమారు 60 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే మండలంలో భూ సమస్యలు ఎక్కువ గా ఉండటంతో పుల్లలచెరువు కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ సమస్యలు చెప్పుకోనేందుకు తహసీల్దార్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు నిరుత్సహంతో వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా కలెక్టరు స్పందించి తక్షణమే రెగ్యులర్‌ తహసీల్దార్‌ను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 18 , 2025 | 01:42 AM