Share News

Sri Chaitanya Toppers: శ్రీచైతన్య స్టేట్‌ టాప్‌ మార్కులు

ABN , Publish Date - Apr 13 , 2025 | 05:13 AM

ఇంటర్‌ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థలు రాష్ట్ర స్థాయిలో టాప్‌ మార్కులతో మరోసారి ప్రతిభ చాటాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో వేలాదిగా విద్యార్థులు అద్భుతంగా రాణించారు

Sri Chaitanya Toppers: శ్రీచైతన్య స్టేట్‌ టాప్‌ మార్కులు

అమరావతి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు స్టేట్‌ టాప్‌ మార్కులు సాధించారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మశ్రీ తెలిపారు. జూనియర్‌ ఎంపీసీలో బుక్కే యశ్వంత్‌ నాయక్‌, ముంద్రు వినూతన స్టేట్‌ టాప్‌ మార్కులు 467తోపాటు, 48 మంది 466 ఆపైన, 291 మంది 465 ఆపైన, 2,628 మంది 460 ఆపైన మార్కులు సాధించారని పేర్కొన్నారు. జూనియర్‌ బైపీసీలో చల్లా లేఖన స్టేట్‌ ఫస్ట్‌ మార్కులు 437తోపాటు 16 మంది 436 ఆపైన, 109 మంది 435 ఆపైన, 834 మంది 430 ఆపైన, సీనియర్‌ ఎంపీసీలో కాంచన మానస, గంగవరం లహరి, కూర్మదాసు శ్రీజ స్టేట్‌ ఫస్ట్‌ మార్కులు 992, సీనియర్‌ బైపీసీలో షేక్‌ అఫీఫా తబస్సుం స్టేట్‌ టాప్‌ మార్కులు 992 సాధించినట్టు తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌లో 992 ఆపైన నలుగురు, 991 ఆపైన 17 మంది, 990 ఆపైన 45 మంది, 985 ఆపైన 625 మంది, 980 ఆపైన 1,800 మంది, 900 ఆపైన 24,331 మంది సాధించినట్టు పేర్కొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 05:32 AM