ఆదిత్యుని కల్యాణోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:51 PM
ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు కల్యాణాంగ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది.

అరసవల్లి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు కల్యాణాంగ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈవో వై.భద్రాజీ, సూపరింటెండెంట్ ఎస్.కనక రాజు, సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు. సూర్య నారాయణ స్వామిని కేంద్ర ఫిషరీస్ సీఈవో బి.జైకుమార్ దర్శించుకున్నారు. ఆయ నకు ప్రధాన అర్చకులు శంకరశర్మ స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.