LPG cylinder Price: బాబోయ్.. 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 3,500..
ABN , Publish Date - Apr 11 , 2025 | 10:04 AM
గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఏకంగా 3500 రూపాయలు పలుకుతుంది. కేజీ గ్యాస్ ధర అయితే గరిష్టంగా 200 రూపాయలకు పైగా ఉంది.. మరి గ్యాస్ ధర ఇంత భారీగా ఎందుకు పెరిగింది.. అసలు ఈ రేటు ఎక్కడ అమల్లో ఉంది అనే వివరాలు..

పెరుగుతున్న నిత్యావసర ధరలు..సామాన్యులకు గుండెపోటు తెప్పిస్తున్నాయి. సంపాదన బెత్తెడు.. ఖర్చులు మూరెడు అన్నట్లుగా ఉంది పరిస్థితి. వీటిల్లో కొన్ని ఖర్చులు తప్పనిసరివి ఉంటాయి. అలాంటి వాటిల్లో గ్యాస్ సిలిండర్ ముందు వరుసలో ఉంటుంది. చమురు కంపెనీలు ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధరను నిర్ణయిస్తుంటాయి. చాలా వరకు ధరలను పెంచుతాయి. అయితే గత కొన్నాళ్లుగా మోదీ ప్రభుత్వం ఇంటి అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరను భారీగా తగ్గించి.. దాన్నే కొనసాగిస్తుంది. ఇలా ఉండగా గ్యాస్ సిలిండర్ ధర 3500 రూపాయలు అనే వార్త సామాన్యులను బెంబేలెత్తిస్తుంది. మరి ఇంతకు ఈ ధరలు ఎక్కడ అమల్లో ఉన్నాయంటే..
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 3500 రూపాయలు ఉంది. అయితే ఈ వార్త చూసి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ ధరలు మన దగ్గర కాదు. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో గ్యాస్ సిలిండర్ ధర ఇంత భారీగా ఉంది. దాంతో ఈ రెండు దేశాల్లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అత్యంత ఖరీదైన వస్తువుగా మారింది. ఇండియాతో పోలిస్తే.. మన దాయాది దేశం పాకిస్తాన్‌లో గ్యాస్ సిలిండర్ ధర నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది.
ఆర్థికమాంద్యంతో బాధపడుతున్న పాకిస్తాన్‌లో గ్యాస్ కొనుగోలు అత్యంత ఖరీదైన విషయంగా మారింది. అంత ధర చెల్లించి కొనుగోలు చేద్దామన్నా సరే.. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో.. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ కోసం జనాలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. పాక్ మీడియా కథనాల ప్రకారం అక్కడ గ్యాస్ ధర రూ.3000-3500 మధ్య ఉంది. మార్చి, 2025లో కేజీ గ్యాస్ ధర గరిష్టంగా 247.82 రూపాయలుగా ఉంది. అదే ఇండియాలో అయితే ఈ ధర కేజీ గ్యాస్‌కి కేవలం 14.2 రూపాయలు మాత్రమే. ఇక దీని ప్రకారం చూసుకుంటే.. పాక్‌లో 14 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ రేటు 3519 రూపాయలుగా ఉంది.
భారతదేశం లాగే, పాకిస్తాన్‌లో కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్లో తరచుగా హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. గ్యాస్ సిలిండర్ ధరలు ప్రస్తుతం పాక్ ఎదుర్కొంటున్న తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని హైలైట్ చేస్తున్నాయి. అలానే మరో పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో కూడా 12 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర 1,232 నుండి 1,498 టాకాల వరకు ఉంది. అయితే బంగ్లాదేశ్‌లో కూడా 12 కిలోల సిలిండర్ ధర తరచుగా మార్కెట్ పరిస్థితులు, సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Women Jailed Husband: మరీ ఇంత దారుణమా.. భర్తపై కక్ష్య గట్టి.. చివరకు
Helicopter Crash: నదిలో కూలిన హెలికాప్టర్..సీఈఓ ఫ్యామిలీ సహా ఆరుగురు మృతి ..