Share News

ఆదిత్యాలయంలో సుగంధద్రవ్య మర్దన

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:02 AM

ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి కల్యాణో త్సవాల్లో భాగంగా సో మవారం సుగంధ ద్రవ్య మర్దన వైభవంగా నిర్వహించారు.

ఆదిత్యాలయంలో సుగంధద్రవ్య మర్దన
కొట్నం దంపులో పాల్గొన్న అర్చకులు

అరసవల్లి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి కల్యాణో త్సవాల్లో భాగంగా సో మవారం సుగంధ ద్రవ్య మర్దన వైభవంగా నిర్వహించారు. తొలుత ఉషా ఛాయా, పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామివా రి ఉత్సవమూర్తులను పూలతో అలంకరణ చేసి ఆలయ అనివెట్టి మండపంలో సు మంగళి పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారికి సమర్పించిన సుగంధ ద్రవ్యా లతో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆలయ ఈవో, అర్చకులు కొట్నం దంపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఈవో వై.భద్రాజీ, అర్చకులు నేతింటి హరిబాబు, ఇప్పిలి సాందీపశర్మ, రంజిత్‌ శర్మ, శ్రీనివాసశర్మ పాల్గొన్నారు.

దినసరి ఉద్యోగుల జీతాల విడుదలకు ఉత్తర్వులు

అరసవల్లి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ఆదిత్యాలయంలో గత 14 నెలలుగా జీతాలు అంద క దినసరి వేతనదారు లు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. చివరికి రాష్ట్రమంత్రి అచ్చె న్నాయుడు చొరవతో పెండింగ్‌ జీతాల విడుదలకు దేవదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 14 నెలల తమ కష్టాలకు తె రపడిందని సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆలయంలో పనిచేస్తున్న 48 మంది దినస రి వేతనదారులకు సం బంధించి, మళ్లీ ఎంతమందిని విధుల్లోకి తీసుకోవాలి అన్న విష యంపై ముగ్గురితో కూడి కమిటీ నిర్ణయిస్తుంది. ఈ కమిటీలో ఆలయ ఈవో భద్రాజీ, దేవదాయశాఖ ఏసీ ప్రసాద రావు పట్నాయక్‌, అలాగే విశాఖకి చెందిన డీసీ స్థాయి అధికారి ఉంటారు. వీరు సిబ్బంది సంఖ్యను నిర్ణయిస్తారు. నిజానికి 2024 జనవరిలో ఆలయం డీసీ స్థాయి ఆలయంగా గు ర్తించినా అందుకు సరిపడా సిబ్బందిని మాత్రం కేటాయించలేదు. డీసీ స్థాయి ఆలయానికి సంబంధించి కనీసం ఒక అసిస్టెంట్‌ ఈవో, ఇద్దరు సూపరింటెండెంట్లు, కనీసం నలుగురు ఇంజనీరింగ్‌ సిబ్బంది (ప్రస్తుతం ఒక్కరూ లేరు), నలుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, సీని యర్‌ అసిస్టెంట్లు ఉండాలి. కానీ ఏడాది గడుస్తున్నా సరే ఇంతవరకు సిబ్బందిని కేటా యంచకపోవడంతో ఒకరిద్దరిపై ఆధారప డాల్సిన పరిస్థితి నెలకొంది. తక్షణమే కావలసి న సిబ్బందిని కేటాయిస్తే ఆలయం అన్నివి దాలా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ దిశగా నాయకులు, అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆదిత్యాలయాన్ని దేశంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు, భక్తులు కోరుతున్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:02 AM