రిమ్స్‌లో అంబులెన్స్ డ్రైవర్ల మధ్య వివాదం
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:13 AM
నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో బుధవారం అంబులెన్స్ డ్రైవర్ల మధ్య కొట్లాట చోటుచేసుకుంది.

గాయపడిన వారిని దారి కాచి దాడిచేసిన రెల్లివీధి యువత
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో బుధవారం అంబులెన్స్ డ్రైవర్ల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. గడిచిన కొద్ది రోజులుగా రిమ్స్‌లో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల మధ్య వివాదం నడుస్తుంది. బుధవారం కొత్త బ్రిడ్జి రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు అంబు లెన్స్ డ్రైవర్లకు పార్టీ ఇచ్చాయి. ఈ క్రమంలో డ్రైవర్ల మధ్య వివాదం చోటు చేసు కుంది. ఈ గొడవలో హరి అనే యువకుడికి గాయపడ్డాడు. దీనిపై బాధితులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎంఎల్‌సీ కోసం రిమ్స్‌లో చికిత్స తీసుకు నేందుకు వెళ్తుండగా హరి, రామకృష్ణ, శంకర్‌లపై రెల్లివీధికి చెందిన కొంత మంది అడ్డగించి దాడి చేశారు. ఈ దాడిలో హరికి తీవ్ర గాయాలు కాగా, శంకర్, రామకృష్ణ గాయపడ్డారు. ఇదిలా ఉండగా ఈ గొడవలో రెల్లివీధికి చెందిన ఓ రౌడీషీటర్ ఉన్నట్టు సమాచారం. దీనిపై టూటౌన్ సీఐ ఈశ్వరరావుకి వివరణ కోరగా.. గొడవ జరగడం వాస్తవమేనని, ఈ ఘటనపై కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు.