Education is a top priorityవిద్యకు అధిక ప్రాధాన్యం: ఎమ్మెల్యే బగ్గు
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:04 AM
Education is a top priority విద్యకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

నరసన్నపేట/పోలాకి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): విద్యకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో మోడల్ పాఠశాలల ఏర్పాటు, ఎన్‌రోల్‌మెంట్ పెంపుపై ఆరా తీశారు. విద్యతో సమాజం అభివృద్ధి చెందు తుందని, అందువల్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడు తున్నాయన్నారు. పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవా లన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు ఉప్పాడ శాంతారావు, పి.దాలినాయుడు, నాయక్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.