Share News

సందడిగా హఠకేశ్వరస్వామి జాతర

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:38 AM

సింగుపురంలో జరుగుతున్న ఉమా హఠకేశ్వర జాతరలో పాల్గొని స్వామివారిని ఎమ్మెల్యే శంకర్‌ ఆదివారం దర్శించుకున్నారు.

 సందడిగా హఠకేశ్వరస్వామి జాతర
హఠకేశ్వరస్వామి జాతరలో ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): సింగుపురంలో జరుగుతున్న ఉమా హఠకేశ్వర జాతరలో పాల్గొని స్వామివారిని ఎమ్మెల్యే శంకర్‌ ఆదివారం దర్శించుకున్నారు. మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

అలాగే ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలుకగా అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ ఈవో భద్రాజీ స్వామివారి జ్ఞాపికను అందజేశారు.

Updated Date - Apr 14 , 2025 | 12:38 AM