Share News

అక్రమ సస్పెన్షన్‌ రద్దు చేయాలి

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:41 PM

పలాస డిపో కండక్టర్‌ ఎన్‌నీలకంఠం అక్రమ సస్పెన్షన్‌ రద్దుచేయాలని టెక్కలిడిపో ఈయూకార్యదర్శి ఎస్‌.మోహనరావు డిమాండ్‌ చేశారు.

 అక్రమ సస్పెన్షన్‌ రద్దు చేయాలి
టెక్కలి ఆర్టీసీ గ్యారేజ్‌ ఎదుట నిరసన తెలుపుతున్న ఈయూ నాయకులు

టెక్కలి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): పలాస డిపో కండక్టర్‌ ఎన్‌నీలకంఠం అక్రమ సస్పెన్షన్‌ రద్దుచేయాలని టెక్కలిడిపో ఈయూకార్యదర్శి ఎస్‌.మోహనరావు డిమాండ్‌ చేశారు. గురువారం టెక్కలి ఆర్టీసీ గ్యారేజ్‌ ఎదురుగా జోనల్‌ కమిటీ పిలుపుమేరకు ఆ సంఘంఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి భోజనవిరామ సమయంలో ధర్నా నిర్వ హించారు. ఈసందర్భంగా మోహనరావు మాట్లాడుతూ ఉద్యోగులకు 1/2019 ఉత్త ర్వులను అమలుచేయాలని, కొత్త బస్సులకు అనుగుణంగా అన్ని డిపోల్లో స్పేర్‌పా ర్ట్స్‌లు సప్లై చేయాలని, శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్‌ మొండివైఖరి విడనాడాలని, ట్రాఫిక్‌ సిబ్బందికి దాడుల నుంచి భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బి.మురళి, ఎస్‌ఎస్‌వీ రమణ, కె.కృష్ణ, ఎర్రయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 11:41 PM