Share News

సాంకేతికతతో సమగ్ర అభివృద్ధి

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:47 PM

సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటే గ్రామీణ ప్రాం తాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించ వచ్చని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే వినూత్న ప్లాంట్‌కు తండేల వలసలో సోమవారం వారు శంకు స్థాపన చేశారు.

సాంకేతికతతో సమగ్ర అభివృద్ధి
శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు

అరసవల్లి, ఏప్రిల్‌ 14 (ఆంధ్ర జ్యోతి): సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటే గ్రామీణ ప్రాం తాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించ వచ్చని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే వినూత్న ప్లాంట్‌కు తండేల వలసలో సోమవారం వారు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రక్రియ పర్యావరణ పరిరక్షణతో పాటు, విద్యుదుత్పత్తికి దోహదపడుతుందని అన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సుమారు రూ.20కోట్లతో ఎస్కవరీ వేస్ట్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. కార్పొరేషన్‌ ప్రతి రోజూ చెత్తను అందజేస్తుంది. దీనిని ప్రాసెస్‌ చేయడం ద్వారా ఆయిల్‌, గ్యాస్‌, నీటిని ఆ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆయిల్‌ను జన రేటర్లలో వినియోగించి... విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. నిత్యం సుమారు 50 మెట్రిక్‌ టన్నుల చెత్తను శుద్ధి చేసి... విద్యుత్తు, నీరు, ఎల్పీజీ వంటి ఉప ఉత్పత్తులుగా మారుస్తారు. ఒక మెట్రిక్‌ టన్ను చెత్త నుంచి ఒక మెగావాట్‌ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని నిర్వా హకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు, సంస్థ ప్రతినిథులు రితేష్‌ మున్షీ, మంత్రిత్‌ సింగ్‌, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 11:48 PM