మన కళాకారులకు ‘కందుకూరి’ పురస్కారాలు
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:16 AM
జిల్లా స్థాయి కందు కూరి విశిష్ట పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఈ పురస్కారాలకు మన జిల్లా కళాకారులను ఎంపిక చేసింది.

శ్రీకాకుళం కల్చరల్/కంచిలి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా స్థాయి కందు కూరి విశిష్ట పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఈ పురస్కారాలకు మన జిల్లా కళాకారులను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్‌ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాలను బుధవారం విజయవాడలోని తుమ్మ లపల్లి కళాక్షే త్రంలో ప్రదానం చేయనున్నారు. జిల్లా నుంచి ఈ పురస్కారాలకు ఆరుగురు ఎంపికయ్యారు. పురస్కారాలకు ఎంపికైన వారిలో గుత్తు చిన్నారావు (శ్రీకాకుళం), జె.సూర్య ప్రకాశరావు, కుమార్‌నాయక్ (పలాస), బెందాళం శోభన్‌బాబు (కత్తివరం), బల్లెడ చలపతిరావు (బొరివంక), మెట్ట పోలినాయుడు (శ్రీకాకుళం) ఉన్నారు. వీరికి పురస్కారం కింద రూ.10 వేల వంతున నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందించనున్నారు. 2018లో చివరిసారిగా కందుకూరి పేరిట పురస్కారాలు ఇచ్చారు. ఏడేళ్ల విరామం తరువాత మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాలు ప్రదానం చేయనుంది. వీరికి జిల్లాకు చెందిన కళాకారులు, కళాభిమానులు అభినందించారు.