Share News

రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:43 AM

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వే ద్వారా అన్ని భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష అన్నారు.

రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం
ర్యాలీలో పాల్గొన్న ఆర్డీవో సాయి ప్రత్యూష

ఆమదాలవలస, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వే ద్వారా అన్ని భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష అన్నారు. శనివారం కట్టాచార్యులపేట గ్రామంలో తహసీల్దార్‌ రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రీసర్వే ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో రీసర్వే అవసరాలను తెలియజేస్తూ ఆర్డీవోతో పాటు రెవెన్యూ అధికారులు ర్యాలీ నిర్వహించి అనంతరం గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామసభలో ఆర్డీవో మాట్లాడ ుతూ.. భూ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ఈ రీసర్వే కార్యక్రమాన్ని రై తులకు ఎటువంటి సమస్యలున్నా అర్జీలు ఇచ్చి సమస్యల పరిష్కారంతో ఈ కార్య క్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులతో పాటు సర్వే విభా గానికి చెందిన అధికారులు, అన్ని రకాల భూములకు హద్దులు నిర్ణయించడంతో పాటు భూముల స్వభావాన్ని నిర్ధారించడం జరుగుతుందన్నారు. కార్య క్రమంలో డీటీ శ్రీనివాసరావు, సర్వేయర్‌ గోపి, సర్పంచ్‌ ఎన్ని రామచం ద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 12:43 AM