Anchor Ravi Controversy: యాంకర్ రవి, సుడిగాలి సుధీర్‌పై హిందూ సంఘాల ప్రతినిధులు ఫైర్..
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:59 PM
బుల్లితెర నటులు యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఓ టీవీ షో సందర్భంగా వారు చేసిన స్కిట్‍పై హిందూ సంఘాల ప్రతినిధులు భగ్గుమన్నారు.

హైదరాబాద్: బుల్లితెర నటులు యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఓ టీవీ షో సందర్భంగా వారు చేసిన స్కిట్‍పై హిందూ సంఘాల ప్రతినిధులు భగ్గుమన్నారు. హిందూ దేవుళ్లను అపహాస్యం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలను రవి, సుధీర్ దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘం నేత కేవశరెడ్డి.. యాంకర్ రవికి ఫోన్ చేసిన మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్‍గా మారింది. దేవుడి పేరితో డ్రామాలు చేయడం తగదంటూ రవిని ఆయన హెచ్చరించారు.
తమ దేవుళ్లను కించపరుస్తూ స్కిట్‌లు చేయడం ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయిందంటూ మండిపడ్డారు. సాటి హిందువుగా ఉంటూ దేవుళ్లను కించపరచడం ఏంటని ప్రశ్నించారు. తప్పు చేశాననే పశ్చాతాపం కూడా కనిపించడం లేదని యాంకర్‍పై కేశవరెడ్డి ఆగ్రహించారు. అయితే స్కిట్‍లో భాగంగానే తాము అలా చేశామని, హిందూ దేవుళ్లను తామేక్కడా కించపరచలేదని యాంకర్ రవి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా(బావగారూ బాగున్నారా)కు సంబంధించిన సీన్లనే తాము రిక్రియేట్ చేసినట్లు చెప్పారు.కొత్తగా తాము చేసిందేమీ లేదన్నారు. స్కిట్ సమయంలో అక్కడున్న వారంతా చెప్పులు, షూలు తీసి మరీ చిత్రీకరించామని చెప్పుకొచ్చారు రవి.
అయినా కేశవరెడ్డి మాత్రం మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దంటూ ఘాటుగా హెచ్చరించారు. కాగా, ఒకప్పటి హీరోయిన్ రంభ టీవీ షోకి వచ్చిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ఆమె నటించిన బావగారూ బాగున్నారా సినిమా సన్నివేశాన్ని బుల్లితెర నటులు ప్రదర్శించారు. సెట్‌లో నందీశ్వరుడిని పెట్టి, కొమ్ముల మధ్యలో నుంచి రంభను చూస్తారు సుడిగాలి సుధీర్. ఇలా చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు యాంకర్ రవికి కేశవరెడ్డి ఫోన్ చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. కాగా, తాను చేసింది తప్పేనని మరోసారి అలాంటి వీడియోలు చేయనంటూ యాంకర్ రవి ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి
Nellore Quartz Scam: బయటకు రానున్న నిజాలు.. వారి గుండెల్లో గుబులే
KTR Vs CM Revanth: రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
Read Latest Telangana News And Telugu News