Share News

Train Accident రైలు ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:00 AM

Train Accident ఆమదాలవలస (శ్రీకాకుళం రోడ్డు) రైల్వేస్టేషన్‌ పరిధిలోని వెంగళరావుకాలనీ సమీపంలో అప్‌లైన్‌ ట్రాక్‌ పై మంగళవారం రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.

Train Accident  రైలు ఢీకొని వ్యక్తి మృతి

ఆమదాలవలస, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ కారణాలతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఆమదాలవలస (శ్రీకాకుళం రోడ్డు) రైల్వేస్టేషన్‌ పరిధిలోని వెంగళరావుకాలనీ సమీపంలో అప్‌లైన్‌ ట్రాక్‌ పై మంగళవారం రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. జీఆర్పీ ఎస్‌ఐ మధు సూదనరావు కథనం మేరకు.. బూర్జ మండలం పాలవలస గ్రామానికి చెంది న సురవరపు శ్రీనివాసరావు (42) వ్యక్తిగత పనులపై ట్రాక్‌ దాటు తుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. దీంతో ఆయన మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని గుర్తించారు. మృతుడికి భార్య భవాని, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

చికిత్సపొందుతూ వృద్ధుడు..

ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిలకపాలెం ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి కింద జరిగిన ప్రమాదంలో గాయపడిన ఓ వృద్ధుడు చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. విజయనగరం జిల్లాలోని రేగిడి ఆమదాలవలస మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముగడ చిన లచ్చయ్య (74) సోమవారం లావేరు మండలంలోని బుడు మూరు సంతకు వచ్చాడు. తన పనులను ముగించుకుని రాత్రి వేరే చోట ఉన్నాడు. మంగళవారం తన స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో చిలకపాలెం ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద నిల్చొని ఉన్న లచ్చయ్యను సర్వీసు రోడ్డులో వస్తున్న లారీ ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడడంతో ఆయన్ను శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. లచ్చయ్యకు భార్య, నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య సూర మ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ తెలిపారు.

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు..

కొత్తూరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): కొత్తూరు మేదర వీధికి చెందిన ఆరిక గడ్డెయ్య(47) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ అమీర్‌ ఆలీ తెలిపారు. ఈనెల 13న బహిర్భూమి నిమిత్తం వెళ్లిన గడ్డియ్య ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల కుటుంబ సభ్యులు వెతకటం ప్రారంభించారు. గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులో ఒక మృతదేహం ఉన్నట్లు గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలా నికి ఎస్‌ఐ సిబ్బదింతో చేరుకొని పరిశీలించి గడ్డెయ్య మృతదేహంగా గుర్తిం చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Apr 16 , 2025 | 12:00 AM