ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

South Coast Railway Zone: దక్షిణ కోస్తా రైల్వే జోన్‌తో సిక్కోలుకూ ప్రయోజనమే

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:44 AM

South Coast Railway Zone: ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.

రిమోట్‌తో శంకుస్థాపన చేస్తున్న ప్రధాన మంత్రి మోదీ

  • కొలువుల్లో దక్కనున్న ప్రాధాన్యం

  • పరోక్షంగా ఇతర రంగాలకూ లబ్ధి

  • జిల్లావాసుల్లో హర్షాతిరేకాలు

శ్రీకాకుళం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలసి బుధవా రం శంకుస్థాపన చేశారు. దీంతో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను జిల్లాకు లబ్ధి చేకూరనుంది.


  • ఉత్తరాంధ్రకు మేలు..

విశాఖకు రైల్వేజోన్‌ కేటాయించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుతో పాటు రాష్ట్రానికి చెందిన కూటమి ఎంపీలు తరచూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవారు. దీంతో ఎట్టకేలకు రైల్వేజోన్‌ కల సాకారమైంది. ప్రస్తుతానికి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయాన్ని రూ.149 కోట్లతో నిర్మించనున్నారు.


దీనివల్ల ఉత్తరాంధ్రకు మేలు చేకూరనుంది. ఉత్తరాంధ్రలో భాగమైన శ్రీకాకుళం జిల్లాకు ప్రధాన కార్యాలయం అత్యంత చేరువగా ఉండటంతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు వీలుంటుంది. జిల్లా ప్రజాప్రతినిధులు అక్కడకు వెళ్లి సమస్యలు పరిష్కారం చేసుకునేందుకు అవకాశముంది. అలాగే రైల్వే ప్రాజెక్టులే కాకుండా.. రైల్వే కొలువుల్లో ప్రాధాన్యం లభించనుంది.


యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ఒక్కోటిగా జిల్లాలో రైల్వే పనులను నిర్వహించుకునేందుకు వీలుంటుంది. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు, ప్రతిపాదనలు పెట్టి అవసరమైన నిధులను తీసుకువచ్చేందుకు వెసులుబాటు ఉంటుంది. దీంతో పాటు ప్రత్యక్షంగాను.. పరోక్షంగాను జిల్లాలో వ్యాపార, వ్యవసాయ రంగాల అభివృద్ధికి దోహదపడనుంది. దీంతో జిల్లావాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


  • ఎంతో ప్రయత్నించా.. పార్లమెంట్‌లో పదేళ్లు పోరాడా ..

విశాఖ రైల్వే జోన్‌ కోసం ఎంపీగా గత పదేళ్లు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ.. పోరాడాను. ఎన్నోదఫాలు కేంద్రప్రజాప్రతినిధులకు వినతి ఇవ్వడమేకాకుండా ... రైల్వేజోన్‌ ఆవశ్యకత.. ఉత్తరాంధ్రకు ఏళ్లతరబడి జరుగుతున్న నష్టాన్ని వివరించాను.


ఇప్పటికి ప్రధాన కార్యాలయం విశాఖపట్టణం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో పాటుగా నేను కేంద్రమంత్రిగా పాల్గొనడం.. ఉత్తరాంధ్రకు మేలు కలిగే ‘విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం’ నిర్మాణం కోసం పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది.


ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాకు మరింత లబ్ధికలిగించేలా మున్ముందు చర్యలుంటాయి. భారీ ప్రాజెక్టులు పూర్తిచేయడమే కాకుండా.. కొత్తవి కూడా మంజూరవుతాయి. ప్రధానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.

కె.రామ్మోహన్‌నాయుడు, కేంద్ర మంత్రి

Updated Date - Jan 09 , 2025 | 12:44 AM