Share News

శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభం

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:50 PM

రామచం ద్రాపురం పంచాయతీ పొన్నాంపేటలో శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభం
శ్రీకాకుళం కల్చరల్‌: కోదండ రామాలయంలో పందిరిరాట వేస్తున్న దృశ్యం

ఆమదాలవలస, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రామచం ద్రాపురం పంచాయతీ పొన్నాంపేటలో శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల్లో ఊరే గించారు. శనివారం శ్రీరామ నామస్మరణ, 6న అన్నదా నం, 7న శ్రీరామ పాదుకుల పట్టాభిషేకం కార్యక్రమా లు నిర్వహించనున్నట్లు సర్పంచ్‌ చల్ల ఉష తెలిపా రు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ చల్ల సింహాచలం, చల్ల కామేశ్వరరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కోదండ రామాలయంలో పందిరిరాట

శ్రీకాకుళం కల్చరల్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పాల కొండ రోడ్డులోని కోదండ రామాలయంలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్చ కులు బంకుపల్లి శేషాచార్యులు ఆధ్వర్యంలో ధ్వజస్తం భం వద్ద పందిరిరాట కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులు పాల్గొని పసుపు దంచారు. శనివా రం రాములవారిని పెళ్లికుమారునిగా, సీతాదేవిని పెళ్లికుమార్తెగా తయారుచేసే ఉత్సవం ఉంటుందని తెలిపారు. ఆలయ ధర్మకర్త మణి, సరస్వతి తదితరు లు పాల్గొన్నారు.

పీఎన్‌ కాలనీ యోగా సెంటర్‌లో..

నగరంలోని పీఎన్‌ కాలనీ యోగా సెంటర్‌లో కరుటూరి నాగలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీరామ నవమి ఉత్స వాలు నిర్వహించారు. సీతారాము విగ్రహాలను పెట్టి కల్యాణం జరిపించారు. మహిళలు కోలాటం, నృత్యా లతో సందడి చేశారు. కార్యక్రమంలో పొగిరి సుగుణా కర్‌, యోగా రామారావు, నాగలక్ష్మి, మా ఊరి నాగేశ్వ రరావు తదితరులు పాల్గొన్నారు.

రేపు శ్రీకూర్మంలో..

గార, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): శ్రీకూర్మం దేవాల యం వీధిలో ఆదివారం శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

Updated Date - Apr 04 , 2025 | 11:50 PM