Share News

Srikakulam: అంత్యక్రియలకు ఏర్పాట్లు.. శ్మశానానికి తరలిద్దామనేలోగా..

ABN , Publish Date - Jan 23 , 2025 | 02:42 PM

అతను చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తీర శ్మశానానికి తరలిద్దామనేలోగా ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

Srikakulam: అంత్యక్రియలకు ఏర్పాట్లు.. శ్మశానానికి తరలిద్దామనేలోగా..

Srikakulam: ఆయన చికిత్సకు స్పందించడం లేదు.. ఇక బ్రతకడం కష్టమే అన్నారు వైద్యులు.. ఇక ఆ 85 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యలు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. తీర శ్మశానానికి తరలిద్దామనేలోగా ఆ వృద్ధుడు ఒక్కసారిగా లేచి కూర్చుడంతో అందరు షాక్ అయ్యారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.


సీతంపేట గ్రామానికి చెందిన ధర్మవరపు అప్పారావు అనే వృద్ధుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పారావును పరీక్షించిన వైద్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించట్లేదని, ఆయన బ్రతకడం కష్టమని కాసేపట్లో చనిపోతాడని ధ్రువీకరించారు. ఇక చేసేదేమీ లేక కుటుంబసభ్యులు అతడిని తీసుకుని గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలోనే ప్రాణం పోయిందనుకుని దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయాలని వారి బంధువులకు సమాచారం ఇచ్చారు.

అంబులెన్సు ఇంటివద్దకు చేరుకోగానే అప్పారావును చూసి అందరు భోరున ఏడుస్తూ ఉన్నారు. ఇక అతడిని శ్మశానానికి తరలిద్దామనేలోగా ఆ వృద్ధుడు ఉన్నట్టుండి కళ్లు తెరిచి, కాళ్లు కదిలించాడు. దీంతో వారంతా ఆశ్చర్యపోయి ఆనందించారు.

Updated Date - Jan 23 , 2025 | 04:11 PM