భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:37 AM
నగరంలో ఏసుక్రీస్తు భక్తులు ఆదివా రం మట్టల పండుగ ఘనంగా నిర్వహిం చారు. సుమారు 500 మంది మట్టల పండు గ ర్యాలీ నిర్వహించారు.

శ్రీకాకుళం కల్చరల్, ఏప్రిల్ 13(ఆంధ్ర జ్యోతి): నగరంలో ఏసుక్రీస్తు భక్తులు ఆదివా రం మట్టల పండుగ ఘనంగా నిర్వహిం చారు. సుమారు 500 మంది మట్టల పండు గ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కీర్తనలు ఆలపిస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న సహాయమాత చర్చి వరకు ర్యాలీ చేస్తూ ప్రార్థనలు చేశారు.
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): మట్టల ఆదివారంను(పామ్ సండే) క్రైస్తవులు వేడుకగా జరిపారు. గొల్లవీధి జంక్షన్ వద్ద గల చర్చిలో ప్రార్థనలు జరిపి అనంతరం మట్టలు పట్టుకొని పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. మతపెద్దలు వజ్రపు వెం కటేష్, తదితరులు పాల్గొన్నారు.
నరసన్నపేట, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): స్థానిక కల్వరి బాపిస్టు చర్చి ఆధ్వర్యంలో ఆదివారం మట్టల ఆదివారం ఫాదర్ జాన్ డేవిడ్ పర్యవేక్షణలో చేపట్టారు. ఏసుక్రీస్తు జయం నినాదాలతో ర్యాలీని చేపట్టారు. కార్యక్రమంలో పాస్టర్ రత్నకుమారి, ప్రవీణ్, పి.రవికుమార్, శరత్‌కుమార్, జీవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలస, ఏప్రిల్ 13(ఆంధ్ర జ్యోతి): లోక రక్షకుడైన ఏసుక్రీస్తు సర్వలోక మంతా కల్వరి సిలువలో ప్రాణం పెట్టి రక్షణ అనుగ్రహిస్తున్నాడని సంఘ కాపరి శ్యామ్ అన్నారు. పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి పక్కన గల బైబిల్ మిషన్ చర్చి ఆధ్వర్యంలో నిర్వ హించారు. రామారావు, విజయకుమార్, లక్ష్మ ణరాజు, రాజేష్, ప్రసాద్, ఆనంద్ పలువురు క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.