10th spot: పదోతరగతి మూల్యాంకనం ప్రారంభం
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:28 PM
10th Class Evaluation జిల్లాలో పదోతరగతి మూల్యాంకనం గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళంలోని మహిళా కళాశాల రోడ్డులో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, మహాలక్ష్మినగర్‌లోని చైతన్య స్కూల్ ఆవరణలో మూల్యాంకనం చేపడుతున్నారు.

గుజరాతీపేట, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదోతరగతి మూల్యాంకనం గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళంలోని మహిళా కళాశాల రోడ్డులో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, మహాలక్ష్మినగర్‌లోని చైతన్య స్కూల్ ఆవరణలో మూల్యాంకనం చేపడుతున్నారు. జిల్లాకు వేర్వేరు జిల్లాల నుంచి సుమారు 1,90,000 వరకు జవాబు పత్రాలు చేరాయి. మూల్యాంకనం ఏర్పాట్లను విశాఖపట్నం ప్రాంతీయ సంచాలకులు బి.విజయ్‌భాస్కర్ గురువారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌గా టెక్కలి డిప్యూటీ డీఈవో పి.విలియం, చైతన్య పాఠశాలలో డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌గా శ్రీకాకుళం డిప్యూటీ డీఈవో ఆర్.విజయకుమారిని నియమించారు. వారి పర్యవేక్షణలో ఏడుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 934 చీఫ్ ఎగ్జామినర్స్, 268 మంది స్పెషల్ అసిస్టెంట్లు మూల్యాంకనం చేపడుతున్నారు.