Share News

ఐక్యతతోనే బడుగులకు గుర్తింపు

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:19 AM

ఐకమత్యంతో ఉంటేనే బడుగులకు గౌరవం, గుర్తింపు సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.వెంగళరావు అన్నారు. నగరంలోని స్థానిక ఓ ప్రైవేట్‌ కాంప్లెక్స్‌ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఐక్యతతోనే బడుగులకు గుర్తింపు
అంతా ఏకమవ్వాలని నినదిస్తున్న బీసీ సంక్షేమ సంఘ నాయకులు

- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంగళరావు

అరసవల్లి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): ఐకమత్యంతో ఉంటేనే బడుగులకు గౌరవం, గుర్తింపు సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.వెంగళరావు అన్నారు. నగరంలోని స్థానిక ఓ ప్రైవేట్‌ కాంప్లెక్స్‌ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల, మతాలకు, అతీతంగా బీసీలందరూ ఏకమైతేనే సామాజిక న్యాయం, రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. అందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిగా టెక్కలికి చెందిన గురునాథ్‌ యాదవ్‌, బీసీ సెల్‌ న్యాయవాదుల విభాగం అధ్యక్షుడిగా ఆగూరు ఉమామహేశ్వరరావు, సంఘం ఎచ్చెర్ల నియోజకవర్గం అధ్యక్షుడిగా ముద్దాడ రాజశేఖర్‌ యాదవ్‌ నియమితులయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కిల్లాన శ్రీనివాసరావు, కన్వీనర్‌ ఎ.నరసింహారావు, జిల్లా అధ్యక్షుడు బేగ్‌, ప్రతినిధులు కృష్ణ, నర్తు నరేంద్ర, బుడుమూరు రాజేష్‌, గురునాథ్‌ యాదవ్‌, కిల్లాన మాధవరావు, పసగాడ రామకృష్ణ, కేశవరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 12:19 AM