Gurukula School : విద్యార్థులతో వంట పని!
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:50 AM
వంటపనిలో విద్యార్థులా... నిజమే...నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాళెం గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థులు ఇదే పని చేస్తున్నారు.

తెల్లవారుజామున 3 గంటల నుంచి చపాతీల తయారీ
నెల్లూరు జిల్లా గండిపాళెం గురుకుల పాఠశాలలో వెలుగులోకి
ప్రతి ఆదివారమూ చేస్తారంటున్న ప్రిన్సిపాల్
ఉదయగిరి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): వంటపనిలో విద్యార్థులా... నిజమే...నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాళెం గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థులు ఇదే పని చేస్తున్నారు. ఆదివారం ఉదయం పాఠశాలలో అల్పాహారం అందించేందుకు తెల్లవారుజామున మూడు గంటల నుంచి వంటశాలలో వీరు 45 కిలోల గోధుమపిండితో సుమారు 1500 చపాతీలు సిద్ధం చేస్తూ కనిపించారు. విద్యాబుద్ధులు నేర్చుకుంటారని పంపితే, తమ పిల్లలతో ఇలా వెట్టిచాకిరీ చేయించడం దారుణమని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ పుష్పరాజ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా, ప్రతి ఆదివారం పాఠశాలలో విద్యార్థులు చపాతీలు చేస్తూ వంట కార్మికులకు సహకరిస్తుంటారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లానని సమాధానం ఇచ్చారు.