Thalassemia Run 2025: 8న తలసేమియా రన్
ABN , Publish Date - Apr 16 , 2025 | 06:00 AM
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 8న విశాఖపట్నంలో తలసేమియా రన్-2025 నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొననున్నారు

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహణ
హాజరుకానున్న సీఎం సతీమణి భువనేశ్వరి
విశాఖపట్నం, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 8వ తేదీన విశా ఖ నగరంలో తలసేమియా రన్-2025 నిర్వహించనున్నారు. తలసేమియా, ఇతర జన్యుపరమైన వ్యాధు ల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ రన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొననున్నారు. మే ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఆర్కే బీచ్ రోడ్డులో ఈ రన్ నిర్వహించనున్నారు. 10కే, 5కే, 3కే విభాగాల్లో నిర్వహిస్తున్న రన్‌లో అన్ని వయసుల వారు పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు 9652974235, 9100433499 ఫోన్‌నంబర్లలో సంప్రదించవచ్చు. www.thalassemiarun.com లో పేరు నమోదు చేసుకోవచ్చు.