Share News

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జితసేవా టికెట్ల మే నెల కోటా విడుదల

ABN , Publish Date - Feb 18 , 2025 | 11:40 AM

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అప్‌డేట్. మే నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్..  ఆర్జితసేవా టికెట్ల మే నెల కోటా విడుదల
Tirumala Darshan Tickets

Tirumala Darshan Tickets Release: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మే నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసింది. వేసవి సెలవుల్లో స్వామి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు వివిధ సేవల టికెట్ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల మే నెల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

  • ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేష‌న్‌ కోసం ఫిబ్రవరి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

  • లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.

  • ఫిబ్రవరి 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

  • కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల మే నెల కోటాను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

  • ఫిబ్రవరి 21న వర్చువల్ సేవల కోటా విడుదల

  • వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

  • ఫిబ్రవరి 22న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

  • మే నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

ఫిబ్రవరి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

మే నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Updated Date - Feb 18 , 2025 | 02:04 PM