Share News

V-SAT Merit List: వీశాట్‌ 1 ఫలితాలు విడుదల

ABN , Publish Date - Apr 13 , 2025 | 05:16 AM

వీశాట్‌ 1 ఫలితాలు విడుదలైనట్లు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ తెలిపింది. ఈ నెల 16 నుండి 20 వరకు మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు

 V-SAT Merit List: వీశాట్‌ 1 ఫలితాలు విడుదల

  • 16 నుంచి 20 వరకు కౌన్సెలింగ్‌

గుంటూరు(విద్య), ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకి సంబంధించి బీటెక్‌, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరల్‌, ఫార్మా డీ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీశాట్‌ 1 (విజ్ఞాన్‌ స్కోలాస్టిక్‌ యాప్టిట్యూడ్‌ టెస్ట్‌) ఫలితాలను శనివారం వైస్‌ చాన్స్‌లర్‌, కల్నల్‌ ప్రొఫెసర్‌ పి.నాగభూషణ్‌ విడుదల చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ దేశ్‌ముఖి సమీపంలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ క్యాంపస్‌లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన వీశాట్‌ 1కి అనూహ్య స్పందన లభించిందన్నారు. ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల నుంచి విద్యార్థులు వీశాట్‌కు హాజరైనట్టు చెప్పారు. వీశాట్‌ 2025 ర్యాంకులతో పాటు జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు, ఎంసెట్‌ ర్యాంకులు, ఇంటర్మీడియట్‌ మార్కులను కూడా పరిగణనలోనికి తీసుకుని స్కాలర్‌షిప్‌ అందజేస్తామన్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. కాగా.. వీశాట్‌లో తొలి పది ర్యాంకులు కే.రవితేజ (అనంతపురం), నాగెండ్ల సస్వత్‌ ప్రణయ్‌ (నరసరావుపేట), ఆర్‌.సాయి తేజ (వరంగల్‌), కె.మహేష్‌(విశాఖపట్నం), కె.ప్రియతం కార్తీక్‌ (విజయవాడ), ఎ.సాయి సంతోష్‌రామ్‌(ఏలూరు), కొప్పుల హర్షిల్‌(కృష్ణా జిల్లా), ఎ.దేవి శ్రీ చరిత్‌ (మార్టూరు), షేక్‌ సమీర్‌ బాబు(గుంటూరు), యు.డోలామణి సత్యనాగశంకర్‌(రాజోలు, కోనసీమ జిల్లా) సాధించారని డీన్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిశోర్‌ తెలిపారు. వీశాట్‌ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయని, విద్యార్థుల సెల్‌ఫోన్లకూ ర్యాంకుల వివరాలను పంపిస్తామన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 05:18 AM