YS Sharmila : షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ

ABN, Publish Date - Feb 01 , 2025 | 08:39 PM

Vijaya Sai Reddy meeting with YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. లోటస్ పాండ్‌లోని ఆమె నివాసంలో ఈ సమావేశం జరిగింది.

YS Sharmila : షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ
vijaya sai reddy meeting with YS Sharmila in Hyderabad

అమరావతి, ఫిబ్రవరి 01: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల భేటీ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని వైఎస్ షర్మిల నివాసంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు వీరిరువురి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయని సమాచారం. అయితే వీరి భేటీపై సర్వత్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే.. వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల ఆ పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అనంతరం తాను వ్యవసాయం చేస్తానని ఆయన స్వయంగా ప్రకటించారు.

ఇక వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య దూరం పెరిగింది. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో గతేడాది మే, జూన్ మాసంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ షర్మిల బరిలోకి దిగి.. తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే.


ఇంకోవైపు గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 స్థానాలను మాత్రమే గెలుచుకొంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అదీకాక ఆ పార్టీ ఓటమి పాలవడంతో.. అందులోని వారంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేశారు. అలా వచ్చిన వారిలో విజయసాయిరెడ్డి కూడా ఒక్కరు. ఆయన సైతం ఒక్కసారిగా బయటకు వచ్చి.. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని.. రాజకీయాలకు సైతం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు.

Also Read: దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా.. అంటూ సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్


విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైఎస్ షర్మిల..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ విశ్వసనీయత కోల్పోయినందునే విజయసాయిరెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైసీపీని వీడిన మీరు ఇప్పటికైనా నిజాలు చెప్పాలంటూ విజయసాయిరెడ్డిని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఇంతవరకు విజయసాయిరెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని తనకు తెలుసునన్నారు. కానీ వైఎస్ వివేకా హత్య విషయంలో ఇప్పటికి ఆయన ఓ నిజం చెప్పినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. మిగతా విషయాలు సైతం బయట పెట్టాలని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డిని వైఎస్ షర్మిల కోరారు.

Also Read: ఇది సీఎం చంద్రబాబు పవర్..

Also Read: పథకాలకు భారీ కేటాయింపులు.. అవి ఎంతెంత అంటే ?


తన సోదరుడు వైఎస్ జగన్‌కు విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడని గుర్తు చేసుకున్నారు. జగన్ ఏ పని చేయమని ఆదేశిస్తే ఆ పని చేసే వారని చెప్పారు. ఆ క్రమంలో ఎవరిని తిట్టమంటే వాళ్లను తిట్టడమే విజయసాయి రెడ్డి పని అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అలాగే నా అనుకున్న వాళ్లను వైఎస్ జగన్ కాపాడుకోలేక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదన్నారు.

Also Read: మళ్లీ ఎన్‌కౌంటర్: భారీగా మావోయిస్టులు హతం


15 రోజుల పాటు ఇంగ్లాండ్, ప్రాన్స్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాంటూ సీబీఐ కోర్లులో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దంతో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10వ తేదీ మధ్య విజయసాయి.. విదేశీ పర్యటన చేయనున్నారు.

Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 09:28 PM