BJP: జగన్‌పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 23 , 2025 | 01:23 PM
మళ్ళీ సీఎం అవుతానని జగన్ కలలు కంటున్నారని, ఈసారి వైఎస్సార్‌సీపీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్రతి పక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని అనడం విడ్డూరంగా ఉందని.. జగన్‌ది రెండు నాల్కుల ధోరణి అని సోము వీర్రాజు విమర్శించారు.

విశాఖ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు (YSRCP Chief), మాసీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan)పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు (BJP MLC Somu Veerraju) సంచలన వ్యాఖ్యలు (Sensational comments)చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కూటమి లక్ష్యం వైఎస్సార్‌సీపీ ఖాళీ చేయడమేనని.. జగన్ పార్టీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామన్నారు. మళ్ళీ సిఎం అవుతానని జగన్ కలలు కంటున్నారని.. అధికారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఏపిలో ప్రతిపక్ష నాయకుడు శాసన సభకు వెళ్ళడం లేదని, ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరుతున్నారని.. 2014లో వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ సభకు వెళ్ళలేదని అన్నారు. 2024లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి ప్రతి పక్ష హోదా ఇవ్వలేదని.. ప్రతి పక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని అనడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌ది రెండు నాల్కుల ధోరణి అని సోము వీర్రాజు విమర్శించారు.
కేసీఆర్‌పై ఫైర్..
అలాగే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ఆయన రాత్రి పూట సరిగా నిద్ర పోవడంలేదని, కేసీఆర్ తన కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావుల కోసం ఆలోచిస్తున్నారని, వారి కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు కళ్లబొ్ల్లి కబుర్లు చెప్పి పదేళ్లు తెలంగాణను పాలించారుని సోము వీర్రాజు ఆరోపించారు.
Also Read..: స్వాతంత్ర్య సమర వీరులకు సీఎం చంద్రబాబు నివాళి
ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..
ప్రపంచంలో ఎవ్వరు చేయలేనంత నాశనం జగన్మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్రానికి చేశారని, అన్నీ విధాలుగా రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్‌ను ప్రజలు దూరం పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రజలకు పిలుపిచ్చారు. ఆసెంబ్లీలో వైసీపీ దూరగతాలను, ఆక్రమాలను బయటపెట్టామన్నారు. ఆసెంబ్లీలో ఎమ్మెల్యేలకు స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అత్యుత్సాహంగా నిర్వహించారన్నారు. జగన్ హాయాంలో సిఎం రిలిఫ్ ఫండ్ పూర్తి స్థాయిలో ఎవరికి అందలేదని ఆరోపించారు. ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో సిఎం రిలిఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేస్తున్నామన్నారు. టిడ్కో ఇళ్లను దూర్మర్గపు వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని, ఇప్పుడు ఆ భారం లబ్దిదారుల మీద పడుతోందన్నారు. ఒక సెంటూ పనికిరాని భూములు పేదలకు కేటాయించారని, ఆ సైటు వద్దని చెప్తే, తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని విష్ణుకుమార్ రాజు అన్నారు.
మాధవ్ కామెంట్స్...
బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరడం పరిపాటి అయిందన్నారు. ఆదారి ఆనంద్ బీజేపీలో చేరడం శుభపరిణామమన్నారు. దేశ వ్యాప్తంగా నరేంద్రమోదీ పేరు మారుమ్రోగుతుందని, మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. త్వరలో విశాఖలో బీజేపీ పార్టీలో చేరికలు ఉంటాయని మాధవ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు సూచన..
పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్..
కుషాయిగూడ పారిశ్రామికవాడలో పేలుడు
For More AP News and Telugu News
Updated Date - Mar 23 , 2025 | 01:23 PM