Share News

ఈనెల 20 నుంచి చింతలవీధి మోదకొండమ్మవారి ఉత్సవాలు

ABN , Publish Date - Apr 04 , 2025 | 10:32 PM

మండలంలోని చింతలవీధిలో కొలువైన మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవాలను ఈనెల 20, 21, 22వ తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

ఈనెల 20 నుంచి చింతలవీధి మోదకొండమ్మవారి ఉత్సవాలు
చింతలవీధి మోదకొండమ్మ ఉత్సవ పందిరి రాట వేస్తున్న పెద్దలు

మూడు రోజులపాటు నిర్వహణ

ఘనంగా పందిరి రాట కార్యక్రమం

24న అమ్మవారి పుట్టిన రోజు వేడుకలు

పాడేరురూరల్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతలవీధిలో కొలువైన మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవాలను ఈనెల 20, 21, 22వ తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శతకంపట్టు వద్ద పందిరి రాటను గ్రామ పెద్దలు, ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. అమ్మవారి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారన్నారు. మూడు రోజుల ఉత్సవాలు అనంతరం 24వ తేదీన అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గిడ్డి వెంకట్‌, చింతలవీధి సర్పంచ్‌ వంతాల సీతమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, పాడేరు నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు డప్పోడి వెంకటరమణ, ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 10:32 PM