కూటమి నేతల కసరత్తు
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:10 AM
నగర మేయరు గొలగాని హరివెంకటకుమారిపై ఈనెల 19వ తేదీన ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు తగిన వ్యూహాలపై కూటమి నేతలు ఆదివారం దసపల్లా హోటల్‌లో సమావేశమయ్యారు.

మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గేలా వ్యూహం
విశాఖపట్నం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి):
నగర మేయరు గొలగాని హరివెంకటకుమారిపై ఈనెల 19వ తేదీన ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు తగిన వ్యూహాలపై కూటమి నేతలు ఆదివారం దసపల్లా హోటల్‌లో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మేయరుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన బలం సమకూర్చుకున్నామని వెల్లడించారు. ఈనెల 19న అవిశ్వాస తీర్మానం పెట్టే రోజున కార్పొరేటర్లకు తగిన సూచనలు ఇవ్వాలని తీర్మానించారు. సమావేశంలో ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, పి.విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేష్‌బాబు, సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, వీఎంఆర్డీఎ చైర్మన్ ఎం.ప్రణవ్‌గోపాల్, జీవీఎంసీలో టీడీపీ ఫ్లోర్‌లీడరు పీలా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.