Share News

7న డిప్యూటీ సీఎం పర్యటన

ABN , Publish Date - Apr 04 , 2025 | 10:26 PM

గిరిజన ప్రాంతంలో ఈనెల 7వ తేదీన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌ పర్యటనకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

7న డిప్యూటీ సీఎం పర్యటన
బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో అభిషేక్‌ గౌడ్‌, సబ్‌కలెక్టర్‌ సౌర్యమన్‌ పటేల్‌

ఏర్పాట్లను పరిశీలించిన ఐటీడీఏ పీవో, సబ్‌కలెక్టర్‌

చకచకా జరుగుతున్న పనులు

డుంబ్రిగుడ(అల్లూరి జిల్లా), ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ఈనెల 7వ తేదీన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌ పర్యటనకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న ఏర్పాట్లను ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ్‌, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌ శుక్రవారం పరిశీలించారు. అక్కడ చేస్తున్న పనులను చూసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పర్యటనను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అరకు సీఐ హిమగిరి, ఎస్‌ఐ గోపాలరావు, టీడబ్ల్యూ ఏఈఈ అభిషేక్‌, స్థానిక ఇన్‌చార్జి తహసీల్దార్‌ ముజీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 10:26 PM