సీలేరు కాంప్లెక్సులో విద్యుదుత్పత్తి సామర్థ్యంపై ఆరా
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:14 PM
సీలేరు కాంప్లెక్సులో ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ స్పెషల్ ఆఫీసర్ ఏవీ సాంబశివరావు సుడిగాలి పర్యటన చేశారు. సీలేరు కాంప్లెక్సులోని పొల్లూరు, డొంకరాయి, మాచ్‌ఖండ్, సీలేరు జలవిద్యుత్ కేంద్రాలను ఆది, సోమవారం రెండు రోజుల పాటు స్థానిక జెన్‌కో అధికారులతో కలిసి పరిశీలించారు.

పొల్లూరు, డొంకరాయి, సీలేరు, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాలను సందర్శించిన ఏపీ పవర్ సెక్టార్ స్పెషల్ ఆఫీసర్ సాంబశివరావు
సీలేరు, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సులో ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ స్పెషల్ ఆఫీసర్ ఏవీ సాంబశివరావు సుడిగాలి పర్యటన చేశారు. సీలేరు కాంప్లెక్సులోని పొల్లూరు, డొంకరాయి, మాచ్‌ఖండ్, సీలేరు జలవిద్యుత్ కేంద్రాలను ఆది, సోమవారం రెండు రోజుల పాటు స్థానిక జెన్‌కో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీలేరు కాంప్లెక్సులోని జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి సామర్థ్యం, పనితీరుపై ఆరా తీశారు. అలాగే పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో రెండవ దశ నిర్మాణ పనులను కూడా పరిశీలించి 5, 6 యూనిట్లు ఎప్పటికి వినియోగంలోకి వస్తాయని అడిగి తెలుసుకున్నారు. సీలేరు కాంప్లెక్సులోని జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై జెన్‌కో అధికారులతో చర్చించారు. సీలేరులోని పార్వతీనగర్‌లో నూతనంగా నిర్మించే పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ప్రదేశాన్ని, డంపింగ్ యార్డును, ఇంటెక్ డ్యాంను, రెగ్యులేటర్ డ్యాంలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజనీర్ వాసుదేవరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, తదితరులు ఉన్నారు.