ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డ్
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:08 AM
ఆస్తి పన్ను వసూళ్లలో నర్సీపట్నం మునిసిపాలిటీ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఆస్తి పన్ను వసూళ్లలో నర్సీపట్నం ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆస్తి పన్నుపై విధించి వడ్డీపై ప్రభుత్వం గత నెల 26 తేదీన 50 శాతం రాయితీ ప్రకటించడంతో పన్నుల వసూళ్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

రాష్ట్రంలో 8వ స్థానంలో నర్సీపట్నం మునిసిపాలిటీ
గత ఆర్థిక సంవత్సరం కంటే 19.7 శాతం అధికం
లక్ష్యం రూ.7.43 కోట్లు.. వసూలైంది రూ.5.67 కోట్లు
ఫలించిన 50 శాతం వడ్డీ రాయితీ పథకం
చివరి ఆరు రోజుల్లో రూ.68 లక్షలు వసూలు
నర్సీపట్నం, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ఆస్తి పన్ను వసూళ్లలో నర్సీపట్నం మునిసిపాలిటీ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఆస్తి పన్ను వసూళ్లలో నర్సీపట్నం ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆస్తి పన్నుపై విధించి వడ్డీపై ప్రభుత్వం గత నెల 26 తేదీన 50 శాతం రాయితీ ప్రకటించడంతో పన్నుల వసూళ్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కేవలం ఆరురోజుల్లోనే రూ.68 లక్షలు వసూలు కావడం విశేషం. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ రాత్రి పది గంటల వరకు మునిసిపల్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి పన్నులు కట్టించుకున్నారు. దీంతో ఈ నెల 30వ తేదీన రూ.30 లక్షలు వసూలైంది. మునిసిపాలిటీ ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులు, ఖాళీ స్థలాలకు 15,516 అసెస్‌మెంట్లు వున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.7.43 కోట్లు ఆస్తి పన్నులు వసూలు చేయాల్సి ఉండగా రూ.5.67 కోట్లు వసూలైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4.73 కోట్లు వసూలు చేశారు. దీనికంటే 12.5 శాతం అదనంగా వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించగా 19.7 శాతం వసూళ్లు సాధించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందిని, సచివాలయాల ఉద్యోగులను కమిషనర్ సురేంద్ర అభినందించారు.