Share News

లంబసింగిలో మంచు సోయగం

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:27 PM

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగిలో మంచు సోయగాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వేసవి ప్రారంభమైనప్పటికి వారం రోజులుగా ఉదయం వేళల్లో మంచు కురుస్తున్నది.

లంబసింగిలో మంచు సోయగం
చెరువులవేనంలో ఆవిష్కృతమైన మంచు సోయగం

చింతపల్లి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్‌ లంబసింగిలో మంచు సోయగాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వేసవి ప్రారంభమైనప్పటికి వారం రోజులుగా ఉదయం వేళల్లో మంచు కురుస్తున్నది. ఆదివారం లంబసింగి, చెరువులవేనంలో ఆవిష్కృతమైన మంచు అందాలు సందర్శకులను అలరించాయి. గత పది రోజులుగా గిరిజన ప్రాంతంలో సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. వాతావరణం చల్లబడింది. దీంతో ఉదయం వేళల్లో మంచు కురుస్తున్నది.

Updated Date - Apr 06 , 2025 | 11:27 PM